భారత సైనికుల చేతులను ప్రధాని కట్టేశారు : రాహుల్ గాంధీ
posted on Jul 29, 2025 6:51PM
.webp)
ఆపరేషన్ సిందూర్ విషయంలో ఎన్డీయే సర్కార్ 30 నిమిషాల్లోనే పాకిస్థాన్‌కు లొంగిపోయిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణ పాటిద్దామని పాక్‌ను అడిగింది. ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని రాజ్‌నాథ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్నికి పాక్‌తో పోరాడే ఆలోచన లేదని తెలిపారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాల వల్లే మన ఎయిర్ కాప్టర్లు కూలిపోయాయి. ఐఏఏప్ లాంటి తప్పు చేయలేదని రాహుల్ తెలిపారు.
ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రభుత్వ పెద్దలు మన సైనికుల చేతులు కట్టేశారని విమర్శించారు. మరోవైపు భారత్-పాక్ యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పుకొంటున్నారు’’అని అన్నారు. ఓ వైపు సీజ్ ఫైర్ కు తానే కారణం అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 29 సార్లు చెప్పారని కానీ ఇప్పటి వరకు ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఖండించలేదన్నారు. ఇందిరాగాంధీలో ఉన్న సగం ధైర్యం ప్రధానికి లేదన్నారు. ఉంటే సీజ్ ఫైర్ లో ట్రంప్ ప్రమేయం లేదని, ప్రధానికి ధైర్యం ఉంటే ట్రంప్ అబద్ధాల కోరు అని సభలో ప్రకటించాలని డిమాండ్ చేశారు. పహెల్గామ్ సూత్రధారి మునీర్ ట్రంప్ తో కలిసి భోజనం చేశారని రాహుల్ విమర్శించారు.
కశ్మీర్ పహెల్గాం ఉగ్రదాడిలో అమాయలు బలయ్యారని పాక్ ఉగ్రవాదులు చేసిన దాడిని అందరూ ముక్తకంఠంతో ఖండిచారని రాహుల్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ లో మన సైనికులు గొప్ప ధైర్యసాహసాలు ప్రదర్శించారని ఈ పరేషన్ విషయంలో కేంద్రానికి ప్రతిపక్షాలు అన్ని సహకరించాయన్నారు. అంటే.. పాకిస్థాన్ తో పోరాడే ఆలోచన లేదని రాజ్ నాథ్ చెప్పారు. అసలు పాకిస్థాన్ తో యుద్ధం చేసే ఆలోచననే రాజ్ నాథ్ చెప్పకనే చెప్పారన్నారు. పహెల్గాం ఉగ్రదాడి తర్వాత ఏ ఒక్క దేశం కూడా పాకిస్తాన్ ను ఖండించలేదని కేవలం ఉగ్రవాదాన్ని మాత్రమే ఖండించాయన్నారు.
1971 యుద్దంలో అప్పటి ప్రభుత్వం నిర్ణయత్మకంగా వ్యవహరించిందని రాహుల్ తెలిపారు. అప్పటి జనరల్ మణిక్ షాకు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పూర్తి సేఛ్చ ఇచ్చారని రాహుల్ పేర్కొన్నారు. యుద్దం చేసే సంకల్పం ప్రభుత్వానికి లేదు. రక్షణ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ చెప్పిన విషయాలు తేటతెల్లం చేస్తున్నాయిని పేర్కొన్నారు. మీరు దాడులు చేయకండని పాక్ చెప్పడం దేనికి సంకేతం అని రాహుల్ ప్రశ్నించారు. పాక్ దుశ్చర్యను సభలోని ప్రతి ఒక్కరూ ఖండించారు అని రాహుల్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి అండగా ఉంటమని పార్టీలన్నీ చెప్పాయి. దేశంలో ప్రతి పక్షంగా ఐక్యంగా ఉన్నందుకు గర్వపడుతున్నామని రాహుల్ గాంధీ తెలిపారు.