యుద్ధాన్ని ఆపాలని ఏ దేశాధినేత చెప్ప లేదు : ప్రధాని

 

ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్ సభలో విపక్షత నేత రాహుల్‌ గాంధీ కామెంట్స్‌పై ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. పాకిస్థాన్‌ను  కాంగ్రెస్ పాకిస్థాన్‌ను వెనుకేసురావటం దౌర్భగ్యమని ప్రధాని అన్నారు. సర్జికల్ స్ట్రైక్ విషయంలోనూ కాంగ్రెస్ నేతలు ఇలాగే మాట్లాడారు. పైలట్ అభినందన్‌ పాక్‌కు చిక్కుకున్నప్పుడు కూడా ఇలాగే మాట్లాడారని, కానీ ఆయన సురక్షితంగా భారత్ తెచ్చామని చెప్పారు. తాను ఎప్పుడూ ప్రజాపక్షమేనని, ప్రజల మనోభావాలు, వారు తనపై ఉంచిన నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని భారత రక్షణ దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్పారు. ‘పహల్గాం ఉగ్రవాదులు పాక్‌కు చెందినవారు అనడానికి ఫ్రూప్ ఏంటని అడిగారు. పాక్‌కు కాంగ్రెస్ క్లిన్ చిట్ ఇవ్వడం ఆశ్చర్యపరుస్తోంది. అని మోదీ అన్నారు.  

ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో జరుగుతున్న చర్చపై మోదీ మాట్లాడుతూ.. ఈ వర్షాకాల సమావేశాలు భారత్‌ విజయోత్సవానికి నిదర్శనం. ఆపరేషన్‌ సిందూర్‌ విజయానికి ప్రతీకగా విజయ్‌ ఉత్సవ్‌. మన సైనికులు ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ను దేశం మొత్తం విజయోత్సవాలు చేసుకుంటోంది. ఉగ్రస్థావరాలను మనసైన్యం నేలమట్టం చేసింది.140కోట్ల మంది భారతీయులు నాపై నమ్మకం ఉంచారు. సైన్యం వెనుక దేశ ఉంది. మతం కోణంలో పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శత్రువుకు ఊహకు అందని విధంగా శిక్ష విధించాం. 

సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. మన సాయుధ బలగాలు కేవలం 22 నిమిషాల్లో ఆపరేషన్ కీలకమైన దాడులు పూర్తి చేశాయని, 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశామని ప్రధాని తెలిపారు. పహల్గాం దాడి తర్వాత భారత్ గట్టిగా స్పందిస్తుందని పాక్ ఆలోచన చేసిందని, ఆ పని తాము చేసి చూపించామని ప్రధాని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత మాస్టర్ మైండ్స్‌కు నిద్ర దూరమైందని చెప్పారు.ఆపరేషన్‌ సిందూర్‌ ఆపాలని ప్రపంచంలో ఏ నేత కూడా మాకు చెప్పలేదు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ నాతో ఫోన్‌లో మాట్లాడారు. పాక్‌ భారీగా దాడి చేయబోతోందని ఆయన హెచ్చరించారు. 

పాక్‌ భారీ మూల్యం చెల్లించుకుంటుందని జేడీ వాన్స్‌కు చెప్పా.  పాక్‌కు ఎవరు సాయం చేసినా.. చూస్తూ ఊరుకొనేది లేదని చెప్పాం. పాక్‌ ఎలాంటి దాడి చేసినా మేం చూసుకుంటామని వాన్స్‌కు చెప్పాం. బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం చెప్తామని జేడీ వాన్స్‌కు చెప్పాం. పాక్‌కు ఎవరు సహాయం చేసినా.. చూస్తూ ఊరుకునేది లేదని స్పష్టం చేశాం. పాక్‌కు చిరకాలం గుర్తుండిపోయే సమాధానం ఇచ్చాం. పాక్‌ డీజీఎం అర్ధరాత్రి ఫోన్‌ చేసి దాడులు ఆపాలని బతిమాలితేనే ఆపరేషన్‌ సిందూర్‌ నిలిపివేశామని ప్రధాని తెలిపారు 193 ప్రపంచ దేశాల్లో కేవలం మూడు దేశాలే పాకిస్థాన్‌కు అండగా నిలిచాయి’’ అన్నారు.


 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu