కేసీఆర్ తీరు ఎంతమాత్రం బాగాలేదు...
posted on Nov 21, 2014 3:15PM

తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆపరేషన్ బ్లూ స్టార్ అనే మాట ఉపయోగిస్తున్నారని, ఆ మాటకి అర్థం ఆయనకి తెలుసా అని రేవంత్ ప్రశ్నించారు. ‘‘ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాలను కేసీఆర్ దుర్వినియోగం చేస్తున్నారు. నేను సభలో ఏం చెబుతానో అని సీఎం వణికిపోతున్నారు. అందుకే నాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. ఉద్యమ నాయకుడినని చెప్పుకునే కేసీఆర్‌కి ఇలాంటి పనులు తగునా? టీఆర్ఎస్ పార్టీ తమవిగా చెప్పుకుంటున్న టీవీ, పేపర్లలో పెట్టుబడులు ఎక్కడివో కేసీఆర్ ప్రకటించాలి. మీకు చెందిన పలు సంస్థలో ఆంధ్రావారి పెట్టుబడులు లేవా? లేవని చెప్పగలరా? డీఎల్ఎఫ్‌కి సంబంధించి మీరే ఏకపాత్రాభినయం చేస్తారా? మాకు మాట్లాడే అవకాశం ఇవ్వరా? సభలో విపక్షాలు మాట్లాడే అవకాశం ఇచ్చేలా సభాపతి చర్యలు తీసుకోవాలి’’ అన్నారు.