ఐస్‌క్రీమ్-2 .. షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ

 

తారాగణం: జేడీ చక్రవర్తి, నవీన, తనికెళ్ళ భరణి, జీవా, నందు.

 

సంగీతం: సత్య కాశ్యప్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, దర్శకత్వం: రాంగోపాల్‌వర్మ.

 

‘ఐస్ క్రీమ్ -2’ రామ్‌గోపాల్ వర్మ శైలిలో రూపొందిన మరో సస్పెన్స్ థ్రిల్లర్. కొంతమంది యువతీ యువకులు ఒక షార్ట్ ఫిలిం షూటింగ్ చేయాలని అటవీ ప్రాంతానికి వెళ్తారు. వాళ్ళని బ్యాంకు రాబరీ చేయడానికి ప్రయత్నిస్తున్న సిక్కా (చక్రవర్తి) అనే డాకూ కిడ్నాప్ చేస్తాడు. వీళ్ళంతా కలసి వున్న సమయంలో వీళ్ళందరిలో ఒక్కొక్కరు హత్యకు గురవుతూ వుంటారు. తమలో వున్న మనుషులు వరుసగా హత్యకు గురవుతూ వుండటం వల్ల కలుగుతున్న భయంతో, ఈ హత్యలు ఎవరు చేస్తున్నారో అర్థం కాక సస్పెన్స్‌తో అందరూ అల్లాడిపోతారు. చివరికి ఏం జరిగిందనేది, హత్యలు ఎవరు చేస్తున్నారనేది రివీల్ చేయడం న్యాయం కాదు. ఏది ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమా బాగుందని చెప్పి ప్రేక్షకులకు, బాగోలేదని చెప్పి నిర్మాతకి అన్యాయం చేయడం తప్పు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu