మొదట నీ కొడుకు కేటీఆర్ పేరు మార్చు...

 

శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన తెలంగాణ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం నాయకుడు, ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీ రామారావు పేరు తొలగించాలని అడిగే హక్కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎక్కడిదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. కేసీఆర్‌కి ఎన్టీఆర్ పేరు ఇష్టం లేకపోతే ముందు ఆయన కొడుకు కేటీఆర్ (తారక రామారావు)కి ఆ పేరు మార్చేయాలని సూచించారు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరో మర్చిపోయావా అని అచ్చెన్నాయుడు కేసీఆర్ని సూటిగా ప్రశ్నించారు. తెలుగువారందరికీ ఇష్టమైన వ్యక్తి ఎన్టీఆర్ పేరును తొలగించాలని రాజకీయ దురుద్దేశంతో మాట్లాడ్డం సమంజసం కాదని ఆయన అన్నారు. ఆ ఎయిర్ పోర్టుకు రాజీవ్ గాంధీ పేరు పెట్టారని, మరి ఆయన తెలంగాణ వ్యక్తా? తెలుగువాడా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu