టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక ఆధారం స్వాధీనం

 

ఒంగోలులో టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్య కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ క్రమంలో నిందితులు వాడిన స్కూటీ లభ్యమైంది. చీమకుర్తి బైపాస్ రోడ్డులోని ఓ దాబా వద్ద స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సంతనూతలపాడు, చీమకుర్తి వైపు పరారీ అయినట్లు గుర్తించారు. కానీ నిందితులు ఎవరనేది ఇప్పటి వరకూ స్పష్టంగా కనిపెట్టలేకపోయారు. నిందితులను పట్టుకునేందుకు ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలో పోలీసులు గాలిస్తున్నారు. 

పోలీసులు క్లూస్ టీం ద్వారా విచారణ వేగవంతం చేశారు. ప్రకాశంలోని తన కార్యాలయంలో ఉండగా మాస్కులు ధరించి రెండు బైకులపై వచ్చిన ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. వీరయ్య చౌదరి ఛాతీ, గొంతు, పొట్లపై పదిహేను కత్తి పోట్లు పొడిచారు. అనంతరం పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరయ్య చౌదరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.