జగన్ అరెస్ట్ ఫిక్స్?.. అప్పగింతలు అందుకేనా?

వైసీపీ కీలక నాయకులు, వారి సన్నిహితులు గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై వరుసగా కేసులు, అరెస్టుల పర్వం మొదలైంది. ఎన్నికలు ముగియగానే మాచర్ల మాజీ  ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో మొదలైన అరెస్టుల పర్వం తాజాగా రాజ్ కసిరెడ్డి, సీనియర్ ఐపీఎస్ పీఎస్ఆర్ ఆంజనేయుల వరకూ సాగింది. ఈ అరెస్టుల పర్వం ఇంకా కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. కాగా లిక్కర్‌ స్కామ్‌ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్  కసిరెడ్డి అరెస్టుతో ఈ అరెస్టుల ఎపిసోడ్‌కి సీక్వెల్   ఖాయంగా కనిపిస్తున్నది. ఇప్పటికే లిక్కర్ స్కాంపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కాంలో కర్త-కర్మ-క్రియ అన్నీ రాజ్ కసిరెడ్డే అని చెప్పి కలకలం రేపారు. 
వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డిని జగన్ ఏరికోరి తెచ్చుకున్నారు. విదేశాల్లో కసిరెడ్డికి పలు వ్యాపారాలు, ముఖ్యంగా లిక్కర్ కంపెనీలు ఉన్నాయంట. ఆ అనుభవంతో  రాజ్ కసిరెడ్డి జగన్ కు బాగా దగ్గరై, లిక్కర్ స్కాంలో కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలున్నాయి. విజయసాయి రెడ్డి నోటి వెంట కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు రావడంతో ఆయన సడన్‌గా ఫోకస్ అయ్యాడు 
ఐటీ సలహాదారుగా ఉంటూనే కసిరెడ్డి ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డితో కలిసి లిక్కర్ అక్రమ దందా నడిపించారని అధికారుల విచారణలో తేలింది.  ప్రభుత్వం నడిపే మద్యం అవుట్‌లెట్‌లకు ఊరుపేరు లేని మద్యం బ్రాండ్ల సరఫరాను రాజ్ కసిరెడ్డి నియంత్రించారని ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఒక ప్రత్యేక కార్యాలయం నుండి ఎంపి మిధున్‌రెడ్డితో కలిసి మొత్తం కిక్‌బ్యాక్ నెట్‌వర్క్‌ను నడిపించిన కసిరెడ్డి ఇప్పుడు జైలుపాలయ్యారు. దాదాపు 3,000 కోట్ల రూపాయల ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఎంపీ మిథున్ రెడ్డి , అప్పటి ఏపీబీసీఎల్ ఎండీ వాసుదేవ రెడ్డిలకు సిట్ ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది. 
ఈ కేసులో జగన్‌కు అత్యంత ఆప్తుడైన మిధున్‌రెడ్డి ఏ4 నిందితుడిగా బుక్ అయ్యారు. దాంతో ఇక నెక్ట్స్ జగన్ వంతే అన్న టాక్ వినిపిస్తోంది. మద్యం తయారీదారుల నుంచి నెలనెలా కసిరెడ్డి వసూలు చేసిన రూ.60 కోట్ల కమీషన్లు మిథున్‌రెడ్డి నేతృత్వంలో తాడేపల్లిలోని జనగ్  ప్యాలెస్‌కు చేరేవన్న ఆరోపణలున్నాయి. విచారణలో కసిరెడ్డి ఆ వివరాలు వెల్లడించే అవకాశం ఉండటంతో జగన్‌కు అరెస్ట్ భయం పట్టుకుందంట. అందుకే  గత పదేళ్ళలో ఎన్నడూ పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించని జగన్ తాజాగా ఇటీవల 33 మందితో  వైసీపీకి పొలిటికల్ అడ్వయిజరీ కమిటీని నియమించారు.  జగన్ జైలుకెళ్తే ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన  భార్య భారతి పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరించాలి. జగన్ తల్లి విజయమ్మ, చెల్లెలు వైఎస్ షర్మిల రాజకీయంగా ఆయనకు ఎప్పుడో దూరమయ్యాయి. ఇక పార్టీలో నెంబర్2 అనిపించుకుని వైసీపీ ఆవిర్భావం నుంచి అన్ని వ్యవహారాలు తానై చక్కబెట్టిన విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకుని జగన్‌కి గుడ్‌బై చెప్పేశారు. 
విజయసాయిరెడ్డి ఎఫెక్ట్‌తో అసలే అక్రమఆస్తుల కేసుల టెన్షన్‌లో ఉన్న జగన్‌ మెడకు ఇప్పుడు లిక్కర్ స్కాం ఉచ్చు బిగుస్తోంది. జగన్ జైలుకెళ్తే బయటవారికి పార్టీ పగ్గాలు అప్పజెప్పే ప్రసక్తే  ఉండదు. ఎందుకంటే ఆయన సొంత చెల్లెల్నే నమ్మరు. కాబట్టి రాజకీయ అనుభవం లేకపోయినా భారతే ఆయనకు దిక్కవుతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను పొలిటికల్‌గా గైడ్ చేయడం కోసం పార్టీలో ఉన్న సీనియర్లందరితో కలిసి పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీతో వరుస మీటింగులు కూడా నిర్వహిస్తున్నారంట. ఆ పీఏసీకి తనకు అత్యంత నమ్మకస్తుడైన సజ్జల రామకృష్ణారెడ్డినే కన్వీనర్‌గా పెట్టుకున్నారు. సొంత మీడియాలో కూడా భారతికి చేదోడువాదోడుగా ఉంటున్న సజ్జలే రేపు జగన్ జైలుకి వెళ్లాక భారతికి రాజకీయ సహయకుడిగా కూడా కొనసాగుతారని జగన్ నమ్మకంతో ఉన్నారంట.