ఒంగోలు టు రాజమహేంద్ర వరం!.. దేశం జోష్ బ్రహ్మాండం!
posted on May 29, 2023 8:51AM
టైమ్ మనది కానప్పుడు.. వెయిట్ చేయాలి. అలా వెయిట్ చేయడం వల్ల వచ్చే ఫలితాలు సూపర్బ్ గా ఉంటాయి. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. సూపర్‌గా కిక్ ఇస్తాయి. ప్రస్తుతం ఆ కిక్ ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంజాయి చేస్తున్నాయి. ఉదాహరణ చెప్పాలంటే.. తాజాగా రాజమహేంద్రవరం వేదికగా నిర్వహించిన మహానాడు మహాద్భుత విజయం సాధించింది. రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సభకు జనం పోటెత్తారు. అయితే ఈ మహానాడు సూపర్ సక్సెస్ కావడంపై పోలిటికల్ సర్కిల్‌లో వాడీవేడీ చర్చ జరురగుతోంది.
గత ఏడాది అంటే 2022 మే 27, 28 తేదీల్లో ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన మహానాడు... నుంచి సైకిల్ పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కొట్టొచ్చిన్నట్లు కనిపిస్తోంది. ఈ మహానాడు వేదికగానే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ప్రారంభ ప్రకటన చేయడం.. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మినీ మహానాడులు నిర్వహిస్తామని వెల్లడించడం.. అదే విధంగా జగన్ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం... చివరకు తెలంగాణ లోని ఖమ్మం వేదికగా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన శంఖారావ సభ విజయవంతం కావడంతో అక్కడి పార్టీ శ్రేణుల్లో సైతం కొత్త జోష్ కొట్టొచ్చినట్లు కనిపించింది.
అయితే ఈ శంఖారావ సభ సక్సెస్‌తో అధికార గులాబీ పార్టీలో గుబులు రేగింది. ఇక హైదరాబాద్‌లో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ సభకు ప్రజల నుంచి విశేష స్పందన రావడం.. అదే విధంగా అటు విజయవాడలో ఇటు హైదరాబాద్‌లో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఇటీవల ఘనంగా నిర్వహించడం.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేయడం.. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటుని టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ కైవసం చేసుకోవడం చకచకా జరిగిపోయాయి.
ఈ వరుస పరిణామాలన్నీ నిశీతంగా పరిశీలిస్తే.. ఒంగోలులో నిర్వహించిన మహానాడు నుంచి రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడు వరకు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోందని పోలిటికల్ సర్కిల్‌లో బలంగా వినిపిస్తోంది. ఒక్క సారి 2019 నుంచి 2022 మే వరకు చోటు చేసుకొన్న పరిణామాలను గమనిస్తే.. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. దీంతో ఆ ఏడాది ఆ పార్టీ ఆధినాయకత్వం మహానాడును నిర్వహించ లేదు. ఇక 2020లో కరోనా వేళ.. మహానాడు ఊసే లేదు. ఆ మరుసటి ఏడాది అంటే 2021లో కూడా కరోనా ఎఫెక్ట్‌తో మహానాడు నిర్వహించలేదు కానీ... టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆన్‌లైన్‌లో మహానాడు నిర్వహించగా.. దానికి మంచి స్పందన అయితే వచ్చింది.
మరోవైపు జగన్.. గద్దెనెక్కిన తర్వాత తొలి కేబినెట్‌లోని మంత్రుల బూతుల పంచాంగానికి... అలాగే ప్రతిపక్ష పార్టీ నేతగా జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలకు.. ఆయన గద్దెనెక్కిన తర్వాత అమలు చేస్తున్న విదివిధానాలకు ఎక్కడా పొంతన లేదని.... దీంతో జగన్ పాలనపై ప్రజల్లో ఓ విధమైన వ్యతిరేకత వ్యక్తమౌతోంది కానీ ... అది ఏ స్థాయిలో ఉందనేది మాత్రం ఎవరికి ఇతమిద్దంగా అంతు పబట్టని విధంగా.. అర్థం కానీ విధంగా ఉండేది.. కానీ 2022లో ఒంగోలు వేదికగా నిర్వహించిన మహానాడుకు జనం పోటెత్తారు.
దీంతో జగన్ పాలనపై ప్రజలు క్లారిటీగా ఉన్నారని.. వారంతా తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని.. నిన్న.. నేడు.. రేపు కూడా ఆ పార్టీతోనే కలిసి నడుస్తారని అందరికీ అర్థమైంది. తాజాగా రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడుతో అది సుస్పష్టమైందని రాజకీయవర్గాల్లో ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ మహానాడు విజయవంతం కావడంతో.. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పకుండా సత్తా చాటి... అధికారంలోకి వస్తుందన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో బలంగా వ్యక్తమౌతోంది.