గేలు, ఒబామా వల్లే శాండీ తుపాను

Obama Sandy News, Hurricane Sandy Obama, Obama Latest News   Hurricane Sandy

 

స్వలింగ సంపర్కులు, లింగమార్పిడి చేయించుకున్నవాళ్లు, అధ్యక్షుడు ఒబామావల్లే శాండీ లాంటి ప్రకృతి విలయాలు అమెరికాని పట్టి కుదిపేస్తున్నాయని ఓ క్రిస్టియన్ మతబోథకుడు మండిపడ్డాడు. ఒబామా.. స్వలింగ సంపర్కుల వివాహాల్ని ప్రోత్సహిస్తున్నందువల్లే అమెరికా నాశనమైపోతోందంటూ ఆయన తన బ్లాగ్ లో ఆవేశంగా రాసిపారేశాడు.

శాండీ తోపాటు, ఇటీవలికాలంలో వచ్చిన విపత్తులన్నీ ఇలాంటి వాటివల్లే కలుగుతున్నాయని మతబోధకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దేవుడు చాలా పకడ్బందీగా అమెరికాను నాశనం చేస్తున్నాడంటూ చాప్లైన్ చాన్ మెక్ టెర్నాన్ అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ ని ధ్వంసం చేసి జెరూసలెంని ఆక్రమించాలనుకుంటున్న వేలాది ముస్లింల వెనకుండి నడిపిస్తోంది ఒబామాయేనంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించాడాయన.

అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న రోమ్మీకూడా ఓట్లకోసం స్వలింగ సంపర్కుల్ని వెనకేసుకురావడం తనకి ఏమాత్రం నచ్చలేదంటూ కడిగిపారేశాడుకూడా.. రోజురోజుకీ పెరిగిపోతున్న స్వలింగ సంపర్కుల్ని దూరం చేసుకోవడంవల్ల ఓట్ల శాతం భారీగా పడిపోతుందని భావించిన ఒబామా, రోమ్నీ పోటీలుపడిమరీ స్వలింగ సంపర్కుల హక్కులగురించి లెక్చర్లు దంచేయడంపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన చాప్లెన్.. ఇలాంటి అరాచకాలు ఆగితేనే విధ్వంసం ఆగుతుందని హెచ్చరించాడుకూడా..