అమెరికాకు హిందూ అధ్యక్షుడు...!
posted on Jan 19, 2017 4:24PM
.jpg)
అమెరికాకు హిందూ అధ్యక్షుడు కూడా రావొచ్చు అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. ఈరోజు వైట్‌హౌస్‌లో నిర్వహించిన చివరి కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు. నల్లజాతీయుడు అధ్యక్షుడు కావడం మళ్లీ జరిగే అవకాశం ఉందా? అని మీడియా ఆయనను ప్రశ్నించగా.. దానికి ‘అమెరికా.. ప్రజలలో ప్రతిభను గుర్తిస్తూ, అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తొంది. భవిష్యత్తులో మహిళా అధ్యక్షురాలు రావడం మాత్రమే కాదు.. లాటిన్ అధ్యక్షుడో.. యూదు అధ్యక్షుడో.. హిందూ అధ్యక్షుడు కూడా రావొచ్చు’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. కొంత కాలానికి అన్ని రకాల అధ్యక్షులు వస్తారని, అప్పుడు వాళ్లని ఏమని పిలవాలో కూడా తెలియకపోవచ్చు అంటూ నవ్వారు.