భవనం కూలి 30 మంది మృతి..
posted on Jan 19, 2017 3:49PM

భవనం కూలిపోయి దాదాపు 30 మంది మృతి చెందారు. ఈఘటన ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం... ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ప్రఖ్యాతిగాంచిన ప్లాస్కో భవనంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో మంటలు ఆర్పడానికి గాను అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. దాదాపు 200 మంది అగ్నిమాపక సిబ్బంది భవనంలో మంటలు అదుపుచేయడానికి వెళ్లగా.. ఇంతలో ఒక్కసారిగా 17 అంతస్తుల ప్లాస్కో భవనం కుప్పకూలిపోయింది. దీంతో 30 మంది అగ్నిమాపక సిబ్బంది మృతి చెందగా, 75 మందికి పైగా గాయపడ్డారు. గాయపడిన వారిలో 30 మంది సాధారణ పౌరులు ఉండగా, 45 మంది అగ్నిమాపక సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. మరోవైపు భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.