ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పు బుద్ధిలేని నిర్ణయం.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్శిటీగా మార్చుతూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏపీలో సృష్టించిన ప్రకంపనలు ఇంకా కొనసాగుతున్నాయి. జగన్ నిర్ణయాన్ని వైసీపీలోనే పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఆ పార్టీ నాయకులు కొందరు మద్దతుగా కూడా మాట్లాడుతున్నారు.
ఇక విపక్ష తెలుగుదేశం అయితే జగన్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. హెల్త్ వర్సిటీకి   ఎన్టీఆర్ పేరు మార్చేసి వైఎస్ పేరు పెట్టాల్సిన అవసరమేమిటని గట్టిగా నిలదీస్తోంది.   యూనివర్శిటీ పేరు మార్పును వ్యతిరేకిస్తూ రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్.. తన పదవికి   రాజీనామా చేశారు.
ఇక మంత్రి విడదల రజనీ జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ  యూనివర్శిటీకి పేరు మార్పు వల్ల భవిష్యత్  తరాలకు ఒనగూడే ప్రయోజనాలను విపులీకరించారు.  టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ భార్య నందమూరి లక్ష్మీ పార్వతీ  హైల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరును తీసివేయడాన్ని సమర్ధించారు.  రూపాయి డాక్టర్‌గా పేరున్న వైయస్ రాజశేఖరరెడ్డి పేరు వర్సిటీకి పెట్టడం సబబేనంటూ జగన్ కు మద్దతుగా మాట్లాడారు. మరో ప్రాజెక్టుకు ఎన్టీఆర్ పేరు పెట్టాలంటూ.. సీఎం జగన్ వద్దకు ఓ ప్రతిపాదన తీసుకు వెళ్తానన్న ఆమె అసలు ఎన్టీఆర్ పేరుతో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు చేయడం గోప్ప విషయమన్నారు.  

రోజా అయితే తనదైన భాషా ప్రావీణ్యంలో జగన్ నిర్ణయాన్ని సమర్ధిస్తూ విపక్షాలపై విమర్శల వర్షం కురిపించారు. అయితే  తెలుగుదేశం పార్టీ టికెట్ పై గెలిచి ఆ తరువాత  జగన్ పార్టీలోకి వెళ్లిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అయితే  వర్సిటీ పేరు మార్పు విషయం పునరాలోచించాలంటూ ఏకంగా జగన్ కే బహిరంగ లేఖ రాసి, ఆ తరువాత మౌనం వహించారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన రాజకీయ సన్యాసం స్వీకరించే ఉద్దేశంలో ఉన్నారన్న వార్తలు వినవస్తున్నాయి.  ఇక ఎప్పుడూ వైలెంట్‌గా ఉంటూ.. జగన్ కుమద్దతుగా విపక్షాలపై వైలెంట్‌గా విమర్శలతో విరుచుకుపడే గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని  ఊహాతీతమైన మౌనం పాటిస్తున్నారు.

అంతే కాకుండా తన సన్నిహితుల వద్ద జగన్ నిర్ణయాన్ని తప్పుపడుతూ అవన్నీ పిల్ల చేష్టలని వ్యాఖ్యలు చేశారని తెలిసింది. జగన్ సోదరి,    వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల సైతం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పును తప్పుపట్టారు. అలాగే తెలంగాణకు చెందిన  కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి  . యూనివర్శిటీ పేరు మార్పు విషయంలో జగన్ తీరును తప్పు పట్టారు.

 ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై ఇంత చర్చ జరుగుతున్నా ముఖ్యమంత్రి  జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల... వైసీపీ అగ్ర నేతలే ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తు అయితే   హెల్త్ వర్సిటీ పేరు మార్పు ఎందుకు అసంబద్ధమో వివరిస్తూ  విడుదలైన ఒ 2 నిమిషాల.. 18 సెకన్ల క వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాన్ని షేక్ చేసేస్తోంది. ఆ వీడియో  తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌,  ముఖ్యమంత్రిగా ప్రజల కోసం అందించిన వివిధ సంక్షేమ పథకాలతో పాటు వైద్య విద్యను సంస్కరించే దిశగా అడుగులు వేశారని.. ఆ క్రమంలోనే  విజయవాడలో హెల్త్ యూనివర్సిటీని  స్థాపించారని... ఆ తర్వాత ఆ యూనివర్శిటీ  ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా రూపాంతరం చెందిందంటూ సవివరంగా పేర్కొంది.

అలాగే    జగన్ యూనివర్సిటీ పేరు మార్పు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న పలువురు ప్రముఖుల, సామాన్యుల అభిప్రాయాలు కూడా ఈ వీడియోలో ఉన్నాయి.  గత ఏడాది  ఈ హెల్త్ యూనివర్శిటీ చెందిన  దాదాపు 400 కోట్ల రూపాయిల నిధులను  జగన్ సర్కారు దారి మళ్లీంచిందంటూ మీడియాలో అప్పట్లో వెల్లువెత్తిన కథనాలను సైతం ఈ వీడియాలో పొందుపరిచారు. అలాగే ఎన్టీఆర్ పేరు ఈ యూనివర్శిటీకి కొనసాగించేలా.. ఈ నంబర్‌కు 92612 92612 మిస్డ్ కాల్ ఇచ్చి జగన్ కి బుద్ది చెప్పండంటూ ఈ వీడియో ప్రజలకు పిలుపునిచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu