ఎల‌క అనుకున్నా.. అండ‌ర్‌వేరా..!? 

పులి మేక‌ను తింటుంది, గేదె గ‌డ్డి తింటుంది, పాము ఎలుక‌ల్ని ఆహారం చేసుకుంటుంది..కానీ క‌ర్ణాట‌ క‌లో ఒక పాము మాత్రం ఎల‌క అనుకుని గుడ్డ‌ముక్క తిన్న‌ది!

క‌ర్ణాట‌క చామ‌రాజ్‌న‌గ‌ర్  కొట్టుతిట్ట గ్రామం. మామూలుగానే ఆహారం కోసం పాము ప‌రిస‌ర ప్రాంతాలన్నీ తిరుగుతూ ఇళ్ల మ‌ధ్య‌కు వ‌చ్చేసింది. పెర‌ట్లో చెట్ల‌మ‌ధ్య నుంచి ఎవ‌రూ చూడ‌కుండా ఒక ఇంట్లోకి దూరింది. అది ఎవ‌రూ గ‌మ‌నించ‌నే లేదు. ఇంట్లోవారు ఆరుబ‌య‌ట మాట‌ల్లో ప‌డ్డారు. కానీ లోప‌ల పాము మాత్రం తిండి కోసం వెతికింది.. ఒక్క ఎల‌కా ఇవాళ దొర‌క‌లేద‌నుకుంది.. అది మ‌రింత‌ సేపు అటూ ఇటూ తిరిగి మొత్తానికి ఒక‌చోట అలా ప‌డున్న గుడ్డ‌ముక్క‌ని ఎలుక అనుకుని తెగ ఆనం దించి అమాం తం  మింగేసింది. ఆన‌క తీరిగ్గా  కొరికినా, ఏం చేసినా అది గొంతులోనే అడ్డుకుని క‌ద‌ల్లేదు. పాము కీ ఆఖ‌రికి  క‌ద‌ల్లేని  ప‌రిస్థితి వ‌చ్చింది.

మెల్ల‌గా పాకుతున్న పాముని చూసి ముందు ఆ యింటివాళ్లు భ‌య‌ప‌డ్డారు. కానీ అదేమీ చేసేట్టు లేద‌ని అర్ధమ‌యింది. చూస్తే క‌డుపు గొంతు ద‌గ్గ‌ర లావుగా ఉంది. ఏదో మింగ‌లేనిదే తినబోయింద‌ని అర్ధ‌మ యింది. వెంట‌నే పాముల న‌ర్స‌య్య‌లాంటి స్పెష‌లిస్ట్ని పిలిచారు. ఆయ‌న వ‌చ్చి అమాంతం ప‌ట్టే సారు. నెమ్మ‌దిగా ప‌రిశీలిస్తే పాము ఎల‌క అనుకుని ఇంట్లో నేల‌మీద ప‌డున్న అండ‌ర్‌వేర్ తిన‌బోయి జ‌నం అలికిడి అయి మింగ‌బోయింది. దానివ‌ల్ల కాలేదు. 

అది పూర్తిగా మింగ‌లేక‌, క‌క్క‌లేక నానా అవ‌స్థాప‌డుతూ అలా ఉదరం పెరిగి మెల్ల‌గా క‌దులు తోంది. పూర్వం పిల్ల‌లు ఏద‌యినా మింగితే త‌ల‌కిందులు చేసి బ‌య‌టికి వ‌చ్చేలా చేసేవారు గుర్తుందా! స‌రిగ్గా అదే మ‌హాప్ర‌యోగం చేశాడు ఆ వ‌చ్చి వ్య‌క్తి. అపుడు వాడికి అది పాము భ‌య‌మూ అనేది లేదు. అమాం తం దాని తోక‌ప‌ట్టుకుని నేల‌కేసి కొట్ట‌లేదుగాని వేగంగా ఆడించేస‌రికి నోట్లో కుక్క‌నట్టు ఉన్న అండ‌ర్ వేర్ బ‌య‌ట‌ప‌డింది. పామును ప‌ట్టుకుని దూరంగా వ‌దిలేశారు. అది టాటా కూడా చెప్ప‌లేదు.. చంపుతార‌ని.. మ‌ళ్లీ ఇటు రాననుకుంటూ వెళిపోయి బ‌తికిపోయింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu