బాలయ్య కుమార్తె వివాహానికి ఎన్టీఆర్ డుమ్మా!

 

ntr balakrishna, ntr Balakrishna Daughter Marriage

 

 

ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులందరూ హాజరయ్యారు. అయితే నందమూరి బాలకృష్ణ సోదరుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ లు హాజరుకాకపోవడం అక్కడ లోటుగా కనిపించింది.వారిద్దరినీ బాలకృష్ణ పిలవలేదని కొందరు అంటుంటే హరికృష్ణకు ఆహ్వానం అందిందని అయితే జూనియర్ ఎన్టీఆర్ ను పిలవనందున ఆయన రాలేదని, తన తరపున తన మరో కుమారుడు కళ్యాణ్ రామ్ పంపించాడని మరికొందరు అంటున్నారు. ఎన్టీఆర్ – నారా లోకేష్ మధ్య తీవ్ర విభేదాలు ఉన్నాయని, ఇక కొన్నాళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడుకొన్పప్పుడు మొదలయిన వివాదం సమసిపోలేదని, బాబాయ్.. అబ్బాయ్ లకు అభిప్రాయ భేదాలు వచ్చాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ఏది ఏమయినా నందమూరి కుటుంబంలో విభేదాలు అభిమానులను ఆవేదనకు గురిచేస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu