ఆళ్ళగడ్డ పోలింగ్ షెడ్యూలు వివరాలు

 

వైసీపీ నాయకురాలు శోభా నాగిరెడ్డి మరణం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ ఈనెల 14వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తుంది. షెడ్యూలు: అక్టోబర్ 14న నోటిఫికేషన్ జారీ. ఈ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలుకు ఆఖరి తేదీ అక్టోబర్ 21. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 22. నామినేషన్ల ఉపసంహరణకు గడువు అక్టోబర్ 24. నవంబర్ 8వ తేదీన ఆళ్ళగడ్డ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది.. నవంబర్ 12వ తేదీన ఓట్ల లెక్కింపుతోపాటు ఫలితాన్ని కూడా వెల్లడిస్తారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu