మహారాష్ట్రని విడదీయలేరు.. మోడీ
posted on Oct 7, 2014 6:50PM
.jpg)
తాను ప్రధాని పీఠం మీద ఉన్నంతవరకు మహారాష్ట్రను ఎవ్వరూ విడదీయలేరని మోడీ అన్నారు. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వున్నారు. మంగళవారం నాడు మహారాష్ట్రలోని సింధ్‌ఖేడాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు గత పదేళ్ల నుంచి ఉల్లిపాయలు, పత్తి పంటల ఉత్పత్తులపై ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారని, వారు ఇపుడు మహారాష్ట్ర నుంచి ముంబాయిని వేరు చేస్తారంటూ దుష్ప్రచారాన్ని చేస్తున్నారని నరేంద్రమోడీ విమర్శించారు. తాను ముంబాయిని మహారాష్ట్ర నుంచి వేరు చేస్తానని కాంగ్రెస్ చేస్తున్నది కేవలం దుష్ప్రచారం మాత్రమేనని నరేంద్ర మోడీ అన్నారు. తాను ఉండగా ఇండియాలోని ఏ ఒక్కరూ కూడా ఇలాంటి పని చేయలేరని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అసలు ఇలాంటి కుట్ర చేస్తున్నది కాంగ్రెసేనని ఆయన అన్నారు.