ఎక్కవద్దు... మీ మమ్మీ నన్నుకొడుతుంది!
posted on Aug 27, 2022 2:37PM
పిల్లలకి పాకడం రావడం ఆలస్యం ఇల్లంతా తిరిగేస్తుంటారు. వారికి అదో ఆట. ఇల్లంతా కలియ తిరగ డానికి ప్రయత్నిస్తుంటా. కానీ అంత శుభ్రంగా ఉందీ లేనిదీ తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి పిల్లల్ని అలా ఇల్లంతా పాకనీయరు. ఓ క్షణం తర్వాత ఎత్తుకుంటారు. కానీ కొత్తగా నేర్చిన ఆట ఎప్పుడూ పసం దుగానే ఉంటుంది.. పిల్లలకీ అంతే. మాటలు రావు గనుక చేత్తులతో ఎత్తుకున్నవారి మొహాన్ని కొడుతూ కిందకి వదలమంటారు. తల్లిందండ్రులకు, ఇంట్లో పెద్దవారికి అదో ఆనందం. దానికి అంతే ఉండదు.
కానీ ఇలా అమితోత్సాహంతో పిల్లలు మేడ మెట్లు ఎక్కడానికీ ప్రయత్నిస్తుంటారు. ఇది ప్రమాదకరం. అందుకే వెనకాలే తిరుగుతూ మెట్ల వేపు వెళ్లకుండా జాగ్రత్తపడుతుంటారు, జాగ్రత్తపడాలి. నడక వస్తే పట్టుకోవడం మరీకష్టం. ఇంట్లో పిల్లలతో పాటు కుక్కపిల్లనీ అంతే ప్రేమగా చూసుకునేవారు చాలా మందే ఉన్నారు. అది కూడా అలా పాకుతూనో, నడకనేర్చి రెండు అడుగులు వేసే పిల్లలతోనో తిరుగు తూనే ఉంటుంది. దానికి పెద్దవాళ్ల తర్వా త ఇంట్లో హఠాత్తుగా ఈ రాజు, రాకుమారి ఎవరా అని ఆశ్చర్యం.
మెల్లగా ఇంట్లోవారు పిల్లనో, పిల్లాడినో ఎలా చూస్తున్నారన్నది కుక్కపిల్లా గమనిస్తుంది. అదీ అంతే జాగ్ర త్తలు తీసుకుంటుంది. వేగంగా వెళు తుంటే అడ్డుకోవడం, మెట్లు ఎక్కబోతే వారించడమే చేస్తుంది. పిల్ల లు కోపగించి దాన్ని కొడతారు. దానికి దెబ్బే తగలదు కానీ, అడ్డుకోవడం మాత్రం మానదు. పడతారన్న భయం తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో తోడుగా తిరిగే కుక్కపిల్లకీ ఉంటుందేమో!
మీరు చూస్తున్న ఫోటోలో సీన్ అదే. ఆ పసికూన మెట్లెక్కడానికి విశ్వయత్నం చేస్తోంది. ససెమీరా అంగీ కరించని కుక్క అడ్డుకుంటోంది. పిల్లడు ఎక్కి పడితే తల్లిదండ్రులు ఓదార్చి ముద్దెడతారు. కానీ తన్ను లు మాత్రం తనకు తప్పవుకదా! అదీ కారణం కావచ్చు.. అందుకునే అడ్డుకుంటోంది! ఇది ఎక్కడదని కాదు.. ప్రతీ ప్రాంతంలో దాదాపు కుక్కలున్న ప్రతీ ఇంట్లో సీన్ ఇలానే ఉంటుంది. కుక్కలు యజమాని భక్తులు. తిండిపెట్టి పెంచుతున్నారు గనుక, దెబ్బలు తినకూడదుగదా! అందుకునే ఈ రక్షణకు పూనుకుంటుంది!