ఐటెం హీరోయిన్ కాదంట...!
posted on Dec 30, 2013 11:10AM

కొత్త సంవత్సరపు వీడ్కోలు కోసం ఇప్పటికే చాలా కంపెనీలు హీరోయిన్లను భారీ మొత్తంలో పారితోషకం ఇచ్చి మరీ బుక్ చేసుకున్నారు. అయితే హీరోయిన్ నిత్యా మీనన్ ను కూడా సదరు ఓ కంపెనీ వారు వెళ్లి మూడు గంటలు సరదాగా మీ డాన్సులతో అలరిస్తే 70 లక్షల వరకు ఇస్తామని ఆఫర్ చేసారంట. అయితే ఈ ఆఫర్ ను నిత్యా సున్నితంగా.."నాకు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఇష్టం లేదు" అని చెప్పిందట. అయితే ఆ కంపెనీ వారు అంతటితో ఊరుకోకుండా.."మీకు పారితోషకం ఎంతో చెప్పండి.. అంతే ఇస్తామంటూ" వెటకారంగా మాట్లాడాడంట. దాంతో నిత్యాకు ఒళ్ళుమండి.."ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? ఈవెంట్స్ లో ఐటెం సాంగ్స్ చేసే హీరోయిన్ లాగా కనిపిస్తున్నానా?" అంటూ సదరు కంపెనీ మేనేజర్ ను అక్కడే ఉతికి అరేసినంత పని చేసిందట.