మెట్రో పిల్లర్ కు మరొకరు బలి...
posted on May 20, 2017 11:36AM

ఏపీ మంత్రి నారాయణ కొడుకు నిశిత్ నారాయణ మెట్రో పిల్లర్ ను ఢీకొని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే అదే మెట్రో పిల్లర్ ను ఢీకొని సీఐ గాయాలపాలైన సంగతి కూడా విదితమే. ఇప్పుడు తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. మెట్రో పిల్లర్ ను ఢీకొని మరో ప్రాణం పోయింది. వివరాల ప్రకారం...ఎల్బీనగర్ దగ్గరున్న మెట్రో పిల్లర్ ను ఓ డీసీఎం వ్యాన్ ఢీకొంది. ఈ ఘటనలో డీసీఎం వ్యాన్ డ్రైవర్ సర్దార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వాసిగా గుర్తించారు. ఖమ్మం నుంచి హైదరాబాదుకు వంటచెరకును తరలిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మరి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటే బావుంటుంది. లేకపోతే రోజుకో ఘటన చూడాల్సివస్తుంది.