ఎన్ ఐఏ దాడులతో  పిఎఫ్ ఐ-ఎస్‌డిపిఐ ల‌కు ద‌డ ద‌డ 

దేశంలో 15 రాష్ట్రాల్లో పిఎఫ్ ఐ-ఎస్‌డిపిఐ  ఇస్లామిక్ నెట్‌వ‌ర్క్ కార్య‌క‌లాపాల‌పై  నిఘా వేసి వాస్త‌వాల‌ను వెలుగులోకి తీసుకురావ‌డంలో ఎన్ ఐఏ, ఈడీ, ఆయా రాష్ట్రాల పోలీసు వ‌ర్గాలు ఎలాంటి పొర‌పాట్లు లేకుండా స‌మ‌ష్టిగా చేప‌ట్టిన దాడులు మంచి ఫ‌లితాల‌నిచ్చాయి. అంతేకాదు తీవ్ర‌వాద‌సంస్థ‌ల‌కు ద‌డ‌పుట్టిం చాయి.

ఎన్ ఐఏ 15 రాష్ట్రాల్లో చేప‌ట్టిన ద‌ర్యాప్తులు, 106 మందిని అరెస్టు చేయ‌డంలో 86 ప్ల‌టూన్ల పారా మిల‌ట‌రీ ద‌ళాలు, ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు ప‌నిచేశాయి. అరెస్ట‌యిన‌వారిలో ఇస్లామిక్ గ్రూప్ చైర్మ‌న్  ఓఎంఎస్ స‌లీమ్ కూడా ఉన్నాడు. ప‌ట్టుబ‌డిన‌వారిని విడుద‌ల చేయాల‌న్న డిమాండ్‌తో వారి అనుచ‌రులు అల్ల‌ర్లు సృష్టించేందుకు వీలు లేకుండా తీసికెళ్లారు. దాడుల నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి త‌ప్పిదాలు, అజాగ్ర‌త్త‌లూ లేకుండా సాఫీగా జ‌రిగేందుకు, దాడుల‌కు ముందురోజు 300 మంది ఎన్ ఐఏ అధికారులు, సీనియ‌ర్ ఐపి ఎస్ అధికారుల‌కు తాము చేప‌డుతున్న దాడుల గురించి వివ‌రించారు. దాడుల‌ను ప్ర‌తీ నిమిషం ఎన్ ఐఏ డిజీ, ఢిల్లీ హెడ్ క్వార్ట‌ర్స్  ప‌ర్య‌వేక్షించారు. అంతేగాక ఒక అర్ధ‌గంట ముందే చేప‌ట్టి ఆశ్చ‌ర్య‌ ప‌రిచారు. అయితే ఈ దాడులు ఒక్క పూట అనుకుని, నిర్ణ‌యించి అమ‌లు చేసిన‌వి కావు. చాలా రోజులుగా నిఘా పెట్టి ఎంతో స‌మాచారాన్ని సేక‌రించిన త‌ర్వాత స‌మ‌న్వ‌యంతో దాడుల‌ను చేప‌ట్టారు. ఈ కార‌ణంగా దాడులు విజ‌య‌వంత‌మ‌వుతున్నాయి. 

త‌మ‌ది సామాజిక‌-మ‌త‌ప‌ర సంస్థ అని ప్ర‌చారం చేసుకున్న‌ప్ప‌టికీ పిఎఫ్ ఐ అనే ఇస్లామిక్ గ్రూప్ ల‌క్ష్యం మాత్రం సామాన్య‌మైన‌ది కాదు. దేశంలో ఇస్లామిక్ ఖ‌లీఫ్ ఏర్పాటు దాని ల‌క్ష్యం. ఇందులో స‌భ్యులుగా చేరినవారు, చేరుతున్న‌వారంతా సీమీ నుంచి నిషేధానికి గుర‌యిన విద్యార్ధులే! కేర‌ళ నుంచి భార‌త దేశం అంత‌టా పిఎఫ్ ఐ విస్తృతంగా వ్యాపించింది. దీనికి ప‌శ్చిమాసియా దేశాల నుంచి నిధులు అందాయ‌న్నది తేలింది. ఖ‌తార్‌, కువైట‌, ట‌ర్కీల‌లో వ‌లె  ముస్లిం సోద‌రులంద‌రినీ ఒక్క‌టిగా చేయ‌ డ‌మే ఈ సంస్థ ప్ర‌ధాన ల‌క్ష్యంగా ఉంది.  ఇస్లాం వ్యాప్తి కోసంమే ప‌నిచేస్తున్న‌ట్టుగా పైకి ప్ర‌చారం చేసు కుంటున్న ఇలాం టి సంస్థ‌ల నుంచి భారీ ఎత్తున ఆర్దిక మ‌ద్ద‌తు పొందుతున్న‌ది. 

పిఎఫ్ ఐ సంస్థ ప్ర‌ధానంగా యువ‌త‌ను రాజ‌కీయ ఇస్లాం వేపు మ‌ళ్లించే సిద్ధాంతాల‌ను విస్తృతంగా ప్ర‌చా రం చేస్తోంది. ఇక్క‌డ శిక్ష‌కులే ఆఫ్ఘ‌న్‌-పాకిస్తాన్ ప్రాంతంలో జీహాదీసంస్థ‌ల్లో చేరి ల‌క్ష్య‌సాధ‌న‌కు ఆయుధా లుగా మారుతున్నార‌న్న‌ది వెలుగులోకి వ‌చ్చింది. ఇందుకు గొప్ప ఉదాహ‌ర‌ణ ఏమంటే..సీమీ బ‌హిష్క‌ రించిన కేడ‌ర్ ఇండియ‌న్ ముజ‌హ‌దీన్ తీవ్ర‌వాదులుగా రూపుమార్చుకుని పాకిస్తాన్ మ‌ద్ద‌తుతో భార‌త్‌లో పెద్ద ఎత్తున దాడుల‌కు పాల్ప‌డేందుకు సిద్ధ‌ప‌డ‌టం. 

అయితే, సెప్టెంబ‌ర్ 22న దేశ‌వ్యాప్తంగా ఎన్ ఐ ఏ జ‌రిపిన దాడుల‌తో ఇలాంటి గ్రూప్‌లు, తీవ్ర‌వ‌వాదులు భ‌విష్య‌త్తులో అడుగు ముందుకు వేయ‌డానికి భ‌య‌కంపితులు కావ‌డానికి ఓ పెద్ద హెచ్చ‌రిక‌గా మారింది. ఇది నిజంగా హ‌ర్ష‌ణీయం. అంతేగాక‌, దేశంలోని ఇత‌ర తీవ్ర‌వాద ర‌హస్య గ్రూప్‌లు, సంస్థ‌లు రాజ‌కీయ ప‌రంగా ఆయుధాల‌ను వినియోగించుకోవ‌డానికి వీలు లేకుండా చేతులు క‌ట్టేసిన‌ట్ట‌యింది.