తండ్రి వై.ఎస్ బొమ్మే తీసేసాడు..!

రాజుగారికి త‌న శ‌క్తిసామ‌ర్ధ్యాలు ప‌క్క‌దేశాల‌వారికీ తెలియాల‌నిపించింది. అనుకున్న‌దే త‌డ‌వుగా ఆయ‌న గ‌తంలో ప్ర‌జాహిత కార్య‌క్ర‌మాల జాబితాని శిలాఫ‌ల‌కం మీద రాయించి ముందుగా రాజ‌ధాని న‌గ‌రం న‌డి బొడ్డున పెట్టించారు. ఆ త‌ర్వాత దాన్నే అనేకం త‌యారుచేయించి ప్ర‌ధాన ప‌ట్ట‌ణాలు, గ్రామాల స‌రిహ ద్దుల్లో పెట్టించాడు. సేనాప‌తికి ఏమీ అర్ధంగాక ఈ ఆలోచ‌న మ‌ర్మం ఏమిటి రాజా అని అడిగితే, ప‌క్కోడు యుద్ధానికి వ‌చ్చేముందు ఎటు వ‌చ్చినా ఈ శిలాఫ‌ల‌కం చూసి మ‌న పేరు ప్ర‌తిష్ట‌ల‌కు భ‌య‌ప‌డి నీర‌సిస్తా డ న్నాడు. రాజుగారి తెలివికి సేనాధిప‌తి డంగ‌య్యాడు. జ‌గ‌న్ ప‌రిస్థితీ ఇలానే త‌యార‌యింది. 

తీసివేత‌ల మీదే  ఆయ‌న ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అధికారంలోకి వ‌చ్చిన  కొత్త‌ల్లో అమ‌లు చేసిన ప‌థ‌కాల లోగోల  మీద ఆయ‌న తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి  బొమ్మ ఉండేది. ఇపుడు ఆయ‌న  బొమ్మ తీసేసి త‌న బొమ్మ పెట్టుకోవ‌డానికి  వెనుకాడ‌టం లేదు. ముఖ్యంగా న‌వ‌ర‌త్రాల ప్రాజెక్టు లోగో విష‌యంలో వై ఎస్‌కి  ఇచ్చిన ప్రాధాన్య‌త ఇపుడు ఇవ్వ‌లేదు. 

ఏపీ ముఖ్య‌మంత్రి  జ‌గ‌న్  కూడా  రాష్ట్రంలో ప‌లు ప్రాంతాల్లో శిలాఫ‌ల‌కాలు పెట్టించాల‌నుకుంటున్నారు.  కాబోతే వాటిమీద రాయించేంత కీర్తి ప్ర‌తిష్ట‌లంటూ ఏమీ లేవుగ‌నుక న‌వ‌ర‌త్నాల‌నే ప్రాజెక్టుల బొమ్మ‌లు, మ‌ధ్య‌లో ఆయ‌న బొమ్మ చెక్కించి పెడ‌తార‌ట‌!  ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, పాల‌నా ప్ర‌త్యేక‌త‌ల గురించి ప్ర‌చారం లో చేప‌ట్టాల్సిన ప‌ద్ధ‌తుల‌న్నీ అయిపోయాయి. ఏది అనుకున్నా పెద్ద‌గా ప్ర‌యోజ‌నం లేకుండా పోతోంది. పైగా స్వ‌యంగా జ‌గ‌న్ తీసివేత‌ల మీద ఎక్కువ ఆస‌క్తి ఉన్న‌వాడ‌య్య‌! అన్ని ప‌థ‌కాలు, ప్రజాహిత కార్య‌క్ర మాలు, సంస్థ‌ల పేర్లు మార్చేసి అన్నింటా, అన్నిటిమీదా విష్ణుమూర్తిలా ఆయ‌న పేరో, బొమ్మో క‌నిపిం చా లని నిర్ణ‌యించారు. అందుకే శిలాఫ‌ల‌కాల మీద ప్రాజ‌క్టుల బొమ్మ‌లు, మ‌ధ్య‌లో ఆయ‌న బొమ్మ గొప్ప సిని మాటిక్ ఆలోచ‌న. ఏ రాజ‌కీయ‌నాయ‌కునికీ త‌ట్ట‌నిది. 

ఇటీవల అసెంబ్లీలో జగన్ చెప్పిన లాజిక్ ప్రకారం.. నవరత్నాలపై బొమ్మ ఉండేం దుకు వైఎస్ కు అర్హత లేదా అనే డౌట్ సామాన్యులకు వచ్చేలా ఈ డిజైన్ ఉంది. ఇదేదో ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదు. జగన్ స్థాయిలోనే నిర్ణయం జరిగింది. అప్పుడైనా జగన్‌కు.. అయ్యో.. మా నాయన ఫోటో కూడా ఉండాలే అని అనిపించలేదు. ఇంకా చెప్పాలంటే అలా ఉన్న డిజైన్ ను ఆయన తిరస్కరించి కొత్త డిజైన్‌ను ఖరా రు చేసి ఉంటారని ఎక్కువ మంది అభిప్రాయం. 

వాటివ‌ల్ల  ప్ర‌యోజ‌నం ఎంత ఉంటుంది లెక్క‌లు బేరీజు వేసుకోవ‌డం ఆయ‌న‌కు ఇంట్రెస్టు లేదు. అవి అలా పెట్టిస్తే జ‌నం, అస్మ‌దీయులు, త‌స్మ‌దీయులు క్ర‌మేపీ మ‌ళ్లీ త‌న ప్రేమ‌లో ప‌డి నాలుగు ఓట్లు వేయ‌క పోతారా అన్న సుదూరాలోచ‌న‌కు నాంది ప‌టికిన‌ట్టే అనిపిస్తోంది.  అయితే ఈ ఫ‌ల‌కాల ఏర్పాటుకు కోట్లు త‌గ‌లేయ‌డానికి సిద్ధ‌ప‌డ్డారు. అంతేకాదు మ‌న‌సులో గ్రైనేట్ వ్యాపార‌స్థుల ప‌ట్ల ప్రేమ‌ను మ‌రింత వ్య‌క్తం చేయ‌డానికి, వారికి ల‌బ్దిచేకూర్చాల‌న్న గొప్ప సంక ల్పంతోనే ఈ వినూత్న ఆలోచ‌న‌కు శ్రీ‌కారం చుట్టార‌ని విశ్లేష‌కుల మాట‌. 

అయితే ఒక్క విష‌యంలో కాస్తంత జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు, ఆ ఫ‌ల‌కాల‌మీద జ‌గ‌న్ త‌న తండ్రి వైఎస్ ఆర్ బొమ్మ మాత్రం ఉండాల‌నుకోవ‌డం లేద‌ట‌. అదే జ‌రిగితే మాత్రం రాష్ట్రం త‌ప్ప‌కుండా నిప్పుల గుండ‌మే అవుతుంద‌న్న భ‌యాందోళ‌న‌లూ ప్ర‌జ‌ల్లో ఉన్నాయి. ఎందుకంటే, మొన్నీమ‌ధ్య‌నే ఎన్టీఆర్ హెల్త్‌వ‌ర్సిటీ పేరు మార్చి తండ్రిపేరుకి మార్చుకున్నాడు. మ‌రుక్ష‌ణం నుంచి లోకంలోని తెలుగువారంతా తిట్టిన తిట్టు కాకుండా చాలా చాలా కొత్త తిట్ల‌పురాణం అందుకున్నారు. అస‌లే పాల‌నాప‌రంగా ప‌రువు పోగొట్టుకున్న జ‌గ‌న్‌కి భ‌య‌మేప‌ట్టుకుని త‌న పేరు, బొమ్మ‌నే ఫ‌ల‌కాల మీద ఉండేట్టు ఆదేశించార‌ట‌.