ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కవిత
posted on Aug 15, 2025 5:15PM

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత తండ్రి కేసీఆర్‌ను కలిసేందుకు కుటుంబ సభ్యులతో కలిసి కవిత ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు. తన కుమారుడికి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోనున్నట్టు సమాచారం. కవిత అమెరికా పర్యటనకు డిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు ఇప్పటికే అనుమతించింది.బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు అమెరికాకు వెళుతున్నారు. తన కుమారుడిని అక్కడ కాలేజీలో చేర్పించనున్నారు. 15 రోజుల పాటు ఆమె అమెరికాలోనే ఉండనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత నిందితురాలిగా ఉన్న సంగతి తెలిసిందే. 15 రోజుల పాటు కవిత అమెరికాలో ఉండనున్నారు.
కుమారుడిని అమెరికా యూనివర్శిటీలో జాయిన్ చేసి.. కొన్ని రోజులు ఆమె అక్కడే ఉండి.. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు.మరోవైపు అధినేత కేసీఆర్ పార్టీలోని కీలక నేతలకు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు రావాలని ఆదేశించారు. దీంతో కేటీఆర్, హరీష్ రావులతోపాటు పలువురు కీలక నేతలు ఇప్పటికే ఎర్రవల్లికి పయనమయ్యారు. మరికొద్ది రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల అంశంపై చర్చించనున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. అలాగే అసెంబ్లీ సమావేశాలు, కాళేశ్వరం ప్రాజెక్ట రిపోర్ట్ తదితర అంశాలపై చర్చించే అవకాశమున్నట్లు టాక్.