జగన్.. గాయమంటే ఇదీ.. గులకరాయి దెబ్బ కాదు!

ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో రెండు ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూపుతూ నెటిజనులు ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి జగన్ ను చెడుగుడు ఆడేస్తున్నారు. ఇంతకీ ఆ ఫొటోలు ఏమిటంటే.. ఒక ఫొటో జగన్ మనమంతా సిద్ధం యాత్రలో గులకరాయి దాడిలో గాయపడి నుదుటిపై బ్యాండేజ్ తో ఉన్న ఫొటో. మరొకటి  ఏపీలో పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటాల గ్రామంలో తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ అయిన మంజులారెడ్డి అనే  మహిళపై వైసీపీ మూకలు గొడ్డలితో దాడి చేసి నరికితే నుదుటిపై రక్తం గాయంతో కూడ నిర్భయంగా నిలబడిన ఫొటో.

ఆమె అంతటి గాయంతోనూ ఆసుపత్రికి కాదు.. పోలింగ్ ఏజెంట్ ను పోలంగ్ బూత్ లోకే వెడతానని చెప్పింది. ఇప్పుడు ఈ రెండు ఫొటోలనూ, రెండు సంఘటనలనూ పోలుస్తూ  జగన్ పులివెందుల పులి కాదు పిల్లి అంటూ నెటిజనులు ఏకి పారేస్తున్నారు. గులకరాయి దాడిని హత్యాయత్నంగా అభివర్ణించి ఊరూ వాడా ఏకం చేసేయడమే కాకుండా  ఆసుపత్రికి వెళ్లి ఆ గాయానికి ఓ అరడజనుకు పైగా వైద్యుల బృందంతో చికిత్స చేయించుకుని, నుదుటిపై బ్యాండేజీ వేయించుకున్న జగన్ ఎక్కడ.. నుదుటిపై అంగుళం లోతు గాయంతో.. ముఖమంతా ధారగా కారిన రక్తంతో కూడా ధైర్యంగా పోలింగ్ బూత్ లోకి వెళ్లి తెలుగుదేశం ఏజెంట్ గా కూర్చున్న మంజులారెడ్డి ఎక్కడ? అంటూ పోస్టులు పెడుతున్నారు.

జగన్ నుదుటిపై గాయమైతే ఒక్కటంటే ఒక్క రక్తం చుక్క కారిన దాఖలాలు లేవు. ఏక్కడో దూరం నుంచి గులకరాయితో దాడి చేస్తేనే హత్యాయత్నం అంటూ నానాయాగీ చేసిన జగన్, తనకు తగిలిన గాయానికి రోజుకో సైజులో ప్లాస్టర్ తో దర్శనమిస్తే.. మంజులారెడ్డి నుదుటిపై   అంగుళం మేర లోతు గాయంతో ధారగా కారుతున్న రక్తంతో , దెబ్బలతో వాచిపోయిన ముఖంతో చలించకుండా  ఆసుపత్రికి పరుగులు తీయకుండా  పోలింగ్ బూత్‌లోనే కూర్చుంది.  ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ మంజులారెడ్డి ధైర్యాన్ని ప్రస్తుతిస్తూ జగన్ పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu