కొవాగ్జిన్ కు కులాల లింక్! జగన్ రెడ్డి కుట్రలపై జనాల ఫైర్ 

ఆడ లేక మద్దెల ఓడు.. ఈ సామెత పూర్వకాలం నుంచి పాపులర్. ఎవరైనా తాను చేయాల్సింది చేయలేనప్పుడు... ఆ ఫెయిల్యూర్ నుంచి తప్పించుకోవడానికి ఇతరత్రా మార్గాలు వెతుక్కుంటారు. అందుకోసం వెతికే సాకులను ఆడ లేక మద్దెల ఓడు అంటూ విమర్శలు చేస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా ఇప్పుడు అచ్చం అలానే ఉంది. కరోనా కట్టడి, వ్యాక్సినేషన్, కరోనా రోగులకు చికిత్స అందించడంలో పూర్తిగా విఫలమైన జగన్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో తన వైఫల్యాన్ని కప్పి పుచ్చుకునేందుకు అర్ధంపర్ధం లేని వాదనలు చేస్తూ అడ్డంగా బుక్కై పోతున్నారు సీఎం జగన్ రెడ్డి. తాజాగా వ్యాక్సినేషన్ పై జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన కుట్రలను, అసలు నైజానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయనే టాక్ వస్తోంది.

కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాలో  అంతా కేంద్రమే చేస్తుందని చెబుతున్నారు జగన్ రెడ్డి. అదే సమయంలో కొవాగ్జిన్ వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ ఎండీకి.. బంధుత్వాలు లింక్ పెట్టి తన కుల కుతంత్రాన్ని బయటపెట్టుకున్నారు. వ్యాక్సిన్ల కేటాయింపు కేంద్రానిదే అంటూనే... భారత్ బయెటెక్ ఎండీ కృష్ణ ఎల్లాకు...  చంద్రబాబు, రామోజీరావు బంధుత్వం అంటూ కొత్త వాదన తెరపైకి తీసుకువచ్చారు. నిజానికి చంద్రబాబుకు..కృష్ణ ఎల్లాకు బంధుత్వం లేదు.  కాని మంగళవారం  ఓ సమావేశంలో మాట్లాడుతూ వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటి అని రాష్ట్రంలో ఉన్న వారికి..దేశంలో ఉన్న వారికి అందరికీ తెలుసు. భారత్ బయోటెక్ రామోజీ గారి కొడుకు వియ్యంకుడిదే... ఆయన చంద్రబాబు కు బంధువు.. వాళ్లకు అంతా తెలుసంటూ మాట్లాడారు జగన్. 

ఇటీవలే వ్యాక్సిన్ల కేటాయింపు పూర్తిగా కేంద్రం చేతిలో ఉందని ప్రకటించారు సీఎం జగన్మోహన్ రెడ్డి . రాష్ట్రాలకు కూడా ఎంత వ్యాక్సిన్లు ఇవ్వాలన్నది కూడా వాళ్ళే డిసైడ్ చేస్తున్నారని తెలిపారు.తాజాగా మాత్రం  బంధుత్వాలను తీసుకురావడం అందరిని విస్మయ పరుస్తోంది. దేశంలో తయారు అవుతున్న వ్యాక్సిన్లలో 50 శాతం వాటాను నేరుగా కేంద్రం తీసుకుని..మిగిలిన మొత్తాన్ని రాష్ట్రాలకు అమ్ముకునే వెసులుబాటు ఆయా తయారీ సంస్థలకు ఇస్తూ కేంద్రం కొద్ది రోజుల క్రితం విధాన నిర్ణయం తీసుకుంది. అంతా కేంద్రం చేస్తుంటే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధుత్వాల ప్రస్తావన ఎందుకు తెచ్చారన్నది అంతుపట్టడం లేదు. ఏ రాష్ట్రానికి ఎంత వ్యాక్సిన్లు అమ్మాలన్నది కూడా జగన్ చెప్పినట్లు కేంద్రమే డిసైడ్ చేసేటప్పుడు భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా చంద్రబాబుకు బంధువు అయితే ఏంటి?. రామోజీరావు కొడుకు వియ్యంకుడు అయితే ఏంటి? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

భారత్ బయోటెక్ పై సీఎం జగన్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. కృష్ణ ఎల్లా రామోజీకి బంధువైతే చంద్రబాబు ఎలా బంధువు అవుతాడో ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంటే చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. రామోజీ కొడుకు వియ్యంకుడి సంస్థలో ఏం జరుగుతుందో రామోజీకి తెలుస్తుందట.. కాని తన భార్య భారతీ రెడ్డి చైర్మెన్ గా ఉన్న సాక్షిలో ఏం జరుగుతుందో జగన్ రెడ్డికి తెలియదట అంటూ సెటైర్లు వేస్తున్నారు. సాక్షిలో ఏం రాస్తున్నారో తనకు తెలియదంటూ గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్లను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ కౌంటరిస్తున్నారు కొందరు నెటిజన్లు. 

అవును భారత్ బయోటెక్ రామోజీ గారి కొడుకు వియ్యంకుడిదే... ఆయన చంద్రబాబు కు బంధువు అయివుండవచ్చు...! అయితే ఏంటి..?? ఏంచెప్పాలనుకుంటున్నారు జగన్ రెడ్డి అంటూ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళ కంపెనీ ఆంధ్రాలో ఉంటే మూయించేద్దామనుకున్నారా.. తెలంగాణాలో ఉంది కాబట్టి కుదరలేదని ప్రజలకు చెబుతున్నారా..?? అంటూ నిలదీస్తున్నారు. కొవాగ్జిన్ కోసం మీరసలు ఆర్డరు పెట్టారా..??పెడితే ఎన్ని పెట్టారు..??అప్పు అడిగారా..?? అని అడుగుతున్నారు నెటిజన్లు. 

హెటిరోడ్రగ్స్ ఎవరిది..?? అరవిందో ఎవరిది..?? రాంకీ ఫార్మా ఎవరిది..??వాళ్ళకెంత దోచి పెడుతున్నారు..??అంతా దొబ్బి కూడా వాళ్ళు ప్రజలకు కంటి తుడుపు గా ఏమైనా చేసారా‌..?? అంబులెన్సు లు అప్పగించారు మీ జైలు మేట్ బంధువు కు.కానీ వారు రోడ్డు మీద మృతదేహాలనొదిలేసి పోతున్నారు..!! రోడ్డు ప్రమాదం జరిగి గిలగిల కొట్టుకుంటున్నా కాని అందుబాటులోకి రావటం లేదు. పాపం నడి రోడ్డుమీద ప్రాణాలు వదులుతున్నారు..!! ఇప్పుడు కరోనా పీడితుల హాహాకారాలు,వారి బాధను,అవసరాన్ని,అత్యవసరాన్ని సొమ్ము చేసుకోవటం కళ్ళకు కనపడటం లేదా..?? మీచావు మీరు చావండని వదిలేయలేదా..?? అంటూ సీఎం జగన్ ను కడిగిపారేస్తున్నారు ఏపీ జనాలు. రెమిడిసర్ ఇంజెక్షన్లు నల్లబజారు కు తరలించి అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు.ఇది శవాలను పీక్కుతినటం కాదా జగన్ రెడ్డి అంటూ నిలదీస్తున్నారు. 

కోవిడ్ వ్యాక్సిన్ పై ఒక ముఖ్యమంత్రి నోట నుంచి బంధుత్వాలు లింకు కలుపుతూ మాటలు వినటం నిజంగా దౌర్భాగ్యమే అంటున్నారు నెటిజన్లు. ఇంకా కులాన్ని,చంద్రబాబుని అడ్డం పెట్టుకుని నెట్టుకొద్దామంటే కుదరదని స్పష్టం చేస్తున్నారు. మీ సత్తా,మీ పాలనాదక్షత, మీవివేకం జనాలకి,మీపార్టీ వారికి  కూడా స్పష్టంగా అర్ధమయ్యింది జగన్ రెడ్డి గారు అంటూ సెటైర్లు వేస్తున్నారు. ప్రజలను కాపాడుకోవడం చేతకాక పోతే పదవి నుంచి దిగిపోవాలంటూ.. రిజైన్ జగన్ అంటూ పోస్టులు పెడుతున్నారు ఏపీ నెటిజన్లు.