లాక్ డౌన్ దెబ్బకు.. వైన్స్ లు ఖాళీ.. 

మందు  బాబులం  మేము  మందు  బాబులం 
మందు  కొడితే  మాకు  మేమే  మహారాజులం 
అరేయ్  కళ్ళు  తగి  గంతేస్తాం సారా  తగి  చిందేస్తాము 
మందంత  దిగేదాకా  లోకలేయ్  పాలిస్తాం 
మందేస్తే  ముందు  వెనక  లేదని 
ఈ  మందు   లేని  సర్కారే  బందన్న..

ఈ పాట చాలా ఫేమస్.. ఎందుకంటే ఈ పాటలో చెప్పింది నూటికి నూరుపాలు నిజం. కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లి పోయాయి. మొన్నటివరకు ఎట్టి పరిస్థితిలోను లాక్ డౌన్ పెట్టాను అని చూపిన కేసీఆర్ సార్ కూడా చివరికి  హై కోర్టు నిర్ణయానికి తలొంచి  నేటి నుండి 10 దినాలు తెలంగాణాలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.. గిప్పుడు అసలు విషయానికి పోదాం.. 

ఒక వైపు కరోనా విజృంభిస్తుంది లాక్ డౌన్ పెట్టండి అని చాలా మంది దేశంలోని, రాష్ట్రము లోని ప్రభుత్వాలను విమర్శించారు. ప్రభుత్వాలకు ప్రజా ఆరోగ్యం పట్ల ఏ మాత్రం బాధ్యత లేకుండాపోయిందని ఇంకొంత మంది. దాని వెనుక ఎవరి స్వార్థం ఉందో అందరికి తెలుసు. ఆసలు విషయానికి వస్తే  నిన్న కేసీఆర్ సార్ 10 దినాలు  లాక్ అని చెప్పిందో లేదో.. జనాలు ఆగం ఆగం అయ్యిరు.. ఎక్కడ జూసిన లైన్ గట్టిర్రు . లైన్ అంటే ఏ కిరణం షాప్ ముందో రేషన్ షాప్ ముందో అనుకునేరు.. మందు షాప్ ల ముందు జనాలు చీమల బారులు ఉన్నారు. కరోనా గురించి ఆలోచించకుండా. 10 దినాలు మందు లేకుంటే పానాలు పోతాయి అన్న రీతిలో జనాలు పరుగులు తీశారు.  అసలే తెలంగాణ ప్రజలకు సుక్క లేకుంటే ముద్దా దిగదాయే.. మరో వైపు దేశం లో మందులో అమ్మకాల్లో మన తెలుగు రాష్ట్రాలు రెండు పోటీ పడుతున్నాయి. నిన్న ఒక్క రోజు దాదాపు అన్ని వైన్ షాప్స్ లో లిక్కర్ అయిపొయింది. దాదాపు నిన్న ఒక్క రోజు నెల రోజుల స్టాక్ అయిపోయి ఉంటుంది. మందు బాబులు నిన్న సృష్టించిన తతంగం అంత ఇంత కాదు.. ఒక్కొక్కరు అయితే కాటన్స్ కాటన్స్ తీసుకెళ్లారు. లాక్ డౌన్ దెబ్బకు వైన్స్ షాక్ లో ఉన్న స్టాక్ అంత ఖాళీ అయింది. ప్రాణాలు పోతున్నాయి అన్న.. పోయే ముందు కాస్త పెగ్గు వేసి పోతాను అన్నట్లుగా తయారు అయ్యారు జనాలు. ఏం చేస్తాం కలికాలం అందులోను కరోనా గాలం.. 

మందు బాబులకు ముందు చూపు చాలా ఎక్కువని వినడం తప్ప ఎప్పుడు చూడలేదు.. నిన్న ఆ సరదా కూడా తీరింది. లాక్ డౌన్ అనగానే సంచులు వేసుకొని వైన్ప షాప్స్ ముందు లైన్ కట్టరు మందు బాబులు, మే నెలలో పదోవ తేదీ వరకు రోజుకు దాదాపు రూ. 61  కోట్ల సరుకు అమ్మితే , నిన్న ఒక్క రోజే రూ. 125  కోట్ల అమ్మకాలు జరిగాయి. ఇది ఇలా ఉండగా రోజు ఉదయం 6 గంటల నుండి 10 వరకు వైన్ షాపులు తెరిచి ఉండడం విశేషం.