భూకంపం నుండి బుడతడు సేఫ్

 

నేపాల్ భూకంపం వచ్చి ఇప్పటికి ఆరురోజులు ఆయిపోయింది. ఈ భూకంప తాకిడికి నేపాల్ అతలాకుతలమైపోయింది. ఇప్పటివరకు 5 వేల మందికి పైగా మరణించారు. కాని నాలుగు నెలల బుడతడిని మాత్రం ఈ భూకంపం ఏం చేయలేకపోయింది. సోనిత్ అవల్ అనే నాలుగు నెలల బుడతడు నేపాల్ భూకంపం నుండి క్షేమంగా బయటపడ్డాడు. సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బంది ఓ ఇంటి శిథిలాలు తొలగిస్తుండగా ఈ నాలుగు నెలల పసిపిల్లాడు బయటపడ్డాడు. 20 గంటల పాటు శిథిలాల కింద ఉన్నా కూడా బాలుడు సురక్షితంగా ఉండటంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu