ఏపీలో 10 జాతీయ రహదారుల విస్తరణ..డీపీఆర్‌కు కేంద్రం ఆదేశాలు

 

ఆంధ్రప్రదేశ్‌లో పది జాతీయ రహదారులు విస్తరణకు నోచుకోనున్నాయి. రోడ్లపై వాహన రద్దీతో పాటు మున్ముందు మరింత ట్రాఫిక్‌ పెరిగే అవకాశం ఉందని గుర్తించడంతో వాటి విస్తరణపై కేంద్రం దృష్టిపెట్టింది. ఆయా జాతీయ రహదారులను 988 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది.

988 కిలోమీటర్ల విస్తరణకు డీపీఆర్‌ తయారీకి కేంద్రం ఆదేశాలు - 2025-26 వార్షిక ప్రణాళికలో చేర్చిన మోర్త్‌ కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు 380 కిలోమీటర్ల NH-216ని నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. ఇందులో కత్తిపూడి నుంచి కాకినాడ వరకు 27 కిలోమీటర్లు ఇప్పటికే నాలుగు వరుసలుగా ఉంది. దీనిని ఆరు వరుసలు చేయనున్నారు. మిగిలిన భాగం ప్రస్తుతం రెండు వరుసలు ఉండగా నాలుగు వరుసలుగా విస్తరిస్తారు. 

కర్నూలు నుంచి నంద్యాల, కడప, రాయచోటి, పీలేరు, చిత్తూరు మీదుగా తమిళనాడులోని రాణీపేట వరకు ఉన్న NH-40ని కడప నుంచి చిత్తూరు జిల్లాలోని రంగంపేట క్రాస్‌ వరకు 148 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరించనున్నారు శ్రీ సత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్ట్‌ నుంచి సిర వరకు 99 కిలోమీటర్లు 4వరుసలు చేస్తారు. ఏపీ, కర్ణాటక సరిహద్దు నుంచి కదిరి, ముదిగుబ్బ మీదుగా అనంతపురం వరకు 86 కిలోమీటర్లు 4 వరుసలుగా విస్తరిస్తారు. ఇందులో కదిరి, ముదిగుబ్బల వద్ద బైపాస్‌లు కూడా ఉన్నాయి. పలమనేరు నుంచి కుప్పం మీదుగా తమిళనాడులోని కృష్ణగిరి సరిహద్దు వరకు 97 కిలోమీటర్ల విస్తరిస్తున్నారు