పాత పదాలు... కొత్త అర్థాల... మోదీ డిక్షనరీ!

నరేంద్ర మోదీని షార్ట్ గా ఏమంటారు? నమో అనే కదా! అయితే, అందరూ నరేంద్ర మోదీని షార్ట్ గా నమో అంటే ఆయన ఇప్పటి వరకూ చాలా రకాల షార్ట్ ఫామ్స్ నే తన వంతుగా జనంలోకి వదిలారు! తాజాగా scam అంటే ఏంటో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల సభలో చెప్పుకొచ్చారు. సమాజ్ వాది, కాంగ్రెస్, అఖిలేష్, మాయవతి అని ఫుల్ ఫామ్ ఇచ్చారు! దీనికి ప్రతిగా రాహుల్ కూడా తనదైన స్టైల్లో ఓ వివరణ ఇచ్చాడనుకోండి... కాని, మోదీ ఇలా చేయటం కొత్త కాదు. ఇంతకు ముందు ఆయన చాలా సార్లు ఇంగ్లీష్ పదాలకి, హిందీ పదాలకి డిఫరెంట్ మీనింగ్ ఇచ్చి ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, ప్రతిపక్షాల్ని షార్ట్ అండ్ స్వీట్ గా కార్నర్ చేశారు. అవేంటో కొన్ని చూసేద్దాం.... 

 


వికాస్ అనే హిందీ పదానికి మోదీ విద్యుత్, కానూన్, సడక్ అంటూ కొత్త అర్థం చెప్పారు. ఈ మూడు వుంటేనే వికాసం జరిగేది అంటూ జనానికి హామి ఇచ్చారు! ఇక ఎప్పుడూ తనపై విమర్శల గన్ను ఎక్కుపెట్టే అరవింద్ కేజ్రీవాల్ కి నమో ఇచ్చిన షార్ట్ ఫామ్ AK 49! ఇలా అనటానికి కారణం కేజ్రీవాల్ అప్పట్లో తొలిసారి ఢిల్లీ సీఎంగా 49రోజులు మాత్రమే పాలన చేసి రాజీనామా చేయటమే! ప్రధాని హిట్ లిస్ట్ లో కేజ్రీవాలే కాదు సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా వున్నాడు! ABCD అంటే ఏంటో చెబుతూ ఆయన ఆదర్శ్, భోఫోర్స్, కోల్, దామాద్ అన్నాడు! ఆదర్శ్, భోఫోర్స్, కోల్ అనేవి కుంభకోణాలు కాగా దామాద్ అంటే అల్లుడు! సోనియాకి అల్లుడుగా వాద్రా యూపీఏ హయాంలో స్కామ్ లు చేశాడని జనంలోకి సమర్థంగా తీసుకెళ్లగలిగారు!

 


పాకిస్తాన్ లో మూడు ఏకేలు జేజేలు అందుకుంటాయని కూడా ఓ సారి సెటైర్ వేశారు మోదీ! ఆ  ఏకేస్ ఏంటంటే.... ఏకే 47 గన్ను! ఏకే ఆంథొని అనే యూపీఏ కాలపు భారత రక్షణ మంత్రి! ఏకే 49గా పిలవబడే అరవింద్ కేజ్రీవాల్! సబ్ కా అనే హిందీ పదానికి మోదీ ఇచ్చిన వివరణ... సమాజ్ వాది, బహుజన్ సమాజ్ వాది, కాంగ్రెస్ పార్టీలని! ఈ మూడింటిని కలిపి, అంటే, సబ్కాను అంతం చేయాలని పిలుపునిచ్చారు! హిందీలో సబ్కా అంటే అందరూ అని అర్థం తెలిసిందేగా! బీజేపి తప్ప అందర్నీ తిరస్కరించండని ఆయన ఉద్దేశం... 

 


ప్రతిపక్షాల్ని టార్గెట్ చేసే ఛమత్కారాలే కాదు... మోదీ అప్పుడప్పుడూ ఇతర పదాలకి కూడా కొత్త భాష్యాలు చెప్పారు. ఉదాహరణకి NDA అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్. అయితే, ఆయన ఇచ్చిన నేషనల్ డెవలప్ మెంట్ అలయెన్స్! అలాగే, JAM అంటే జన్ ధన్, ఆధార్, మొబైల్ అంటూ చెప్పుకొచ్చారు. డీమానిటైజేషన్ తరువాతి పరిణామాల్లో ఇలా అన్నారు. ఐటీ గురించి కూడా మోదీ ఛమత్కారంగా IT ప్లస్ IT ఈజ్ ఈక్వల్ టూ IT అన్నారు. అంటే, ఇండియన్ టాలెంట్ ప్లస్ ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ ఈక్వల్ టూ ఇండియా టుమారో! 

 


మోదీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చాక ఇలా వాడిన సరికొత్త పదాలు, అర్థాలు, భాష్యాలు ఇంకా చాలానే వున్నాయి. వాట్ని వాడిన తరువాత జరిగిన ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు కూడా చాలా సార్లే వచ్చాయి. కాకపోతే, అప్పటికప్పడు మాత్రం స్పీచ్ వింటోన్న జనాల్లో కొత్త ఉత్సాహం రేకెత్తిస్తున్నాయి ఈ షార్ట్ ఫామ్స్ అండ్ ఫుల్ ఫామ్స్! మోదీ వాక్ చాతుర్యాన్ని చాటుతున్నాయి... 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu