ముగిసిన ఖేడ్ ఉపఎన్నిక పోలింగ్.. కానిస్టేబుల్ మృతి..
posted on Feb 13, 2016 6:12PM

నారాయణ ఖేడ్ ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. ఇప్పటికి 75 శాతం పోలింగ్ నమోదు అయినట్టు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు అధికారులు తెలుపుతున్నారు. 286 పోలింగ్ కేంద్రాలలో ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు.. ఈ నెల 16 న కౌంటింగ్ ను నిర్వహిస్తామని చెప్పారు.
ఇదిలా ఉండగా నారాయణఖేడ్ ఉప ఎన్నికలో విషాదం చోటు చేసుకుంది. ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న వీరాసింగ్ అనే కానిస్టేబుల్ హఠాన్మరణం పొందాడు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో వీరాసింగ్ హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించిన ఎలాంటి ఉపయోగంలేకుండా పోయింది. కానిస్టేబుల్ మృతితో తోటి పోలీసులు, ఎన్నికల సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.