నా తల్లిని నిందించిన వారిని వదిలిపెట్ట.. నారా లోకేశ్ ప్రతిజ్ఞ..
posted on Dec 22, 2021 1:26PM
తన తల్లి భువనేశ్వరిపై ఆరోపణలు చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలను వదిలిపెట్టనని.. వారికి తగిన రీతిలో గట్టిగా బుద్ధి చెప్తానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన తండ్రిలా మెతక వైఖరితో ఉండనని.. గట్టిగా సమాధానం ఇస్తానని చెప్పారు. గౌరవం కోరుకునే కుటుంబం తమదని.. మీ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులపైనా ఇలాగే మాట్లాడతారా? అని వైసీపీ నేతలను ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదల సమయంలో ప్రజల్ని ఆదుకోవాల్సిన మంత్రులు.. విదేశాల్లో జల్సాలు చేశారని ఆరోపించారు. ప్రజలను ఆదుకున్న తమపై నిందలు వేస్తారా? అని లోకేశ్ మండిపడ్డారు.
నారా భువనేశ్వరి స్పందించిన మర్నాడే లోకేశ్ ఇలా హెచ్చరించడంతో ఆ ఘటనతో నారా వారి కుటుంబం ఎంతలా బాధపడిందో అర్థం అవుతోందని అంటున్నారు. తాను కోలుకోవడానికి 10 రోజులు పట్టిందని.. మహిళలపై ఇలాంటి అవమానాలు దారుణమని.. ఇలాంటి పనికి మాలిన విషయాలపై కాకుండా.. ప్రజా సేవపై దృష్టిపెట్టాలని భువనేశ్వరి ఘాటుగా స్పందించారు. తాజాగా, నారా లోకేశ్ సైతం వైసీపీకి మరింత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
తన తండ్రిలా తాను మెతక కాదంటూ.. ఆ నలుగురిని వదిలేదే లే అంటూ.. గట్టిగా బుద్ధి చెప్తానంటూ నారా లోకేశ్ వైసీపీ నేతలపై పదునైన వ్యాఖ్యలతో విరుచుకుపడటం సంచలనంగా మారింది.