జగన్ రాసిన లెటర్ ను చించిపారేశారు
posted on Sep 16, 2015 5:40PM

చంద్రబాబు తనయుడు నారా లోకేష్ దూకుడు పెంచారు. ఇక్కడ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిని, అక్కడ టీఆర్ఎస్ సర్కార్ ను ఏకిపారేస్తున్నారు. కొద్దిరోజులుగా జగన్ పై విరుచుకుపడుతున్న చినబాబు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్ మెంట్ కు జగన్ అడ్డంకిగా మారాడని, రాజధాని నిర్మాణానికి అడుగడుగునా అడ్డంకులు కలిగిస్తున్నారని ఆరోపించారు. అక్టోబర్ 22న రాజధాని శంకుస్థాపనకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే, మరోపక్క జగన్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణానికి సహకరించొద్దంటూ సింగపూర్ ప్రభుత్వానికి జగన్ లేఖ రాశారని, అయితే జగన్ లెటర్ ను చదివి నవ్వుకున్న సింగపూర్ పాలకులు దాన్ని చించిపారేశారని లోకేష్ కొత్త బాంబు పేల్చారు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడూ చంద్రబాబుకు మంచి పేరొస్తుందనే బాధే తప్ప... ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుందనే విషయమే గుర్తుకురావడం లేదన్నారు.