ప్రతిపక్షాలకు మర్యాద ఇవ్వడం రాదా?
posted on Sep 16, 2015 5:49PM

ప్రపంచ బ్యాంకు ఏపీకి అరుదైన ఘనత దక్కించిన సంగతి తెలిసిందే. దేశంలోనే పెట్టుబడులు పెట్టడానికి అనుకూల అవకాశాలు ఉన్న ప్రదేశాల్లో ఏపీ రెండో స్థానంలో నిలవడం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందించాల్సి విషయం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ పని చేసినా విమర్శించే ప్రతిపక్ష నాయకులు మాత్రం ఏపీకి అరుదైన ఘనత రావడం విషయంలో మాత్రం నోరు మెదపడంలేదు.
ఒకపక్క ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి దేశాలు పర్యటనలు చేస్తూ పెట్టుబడులు తీసుకురావడానికి కష్టపడుతున్నారు. ఇప్పుడు ఈ ర్యాంకు వల్ల దేశమంతా ఏపీ వైపే చూస్తుంది. అలాంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు దీనిని గౌరవించాల్సిన అవసరం ఉంది.. మీడియా సమావేశాలు పెట్టి ఒకరి మీద ఒకరి విమర్శులు చేసుకోమంటే రెడీగా ఉండే నేతలు మాత్రం ఇప్పటి వరకూ దీనిపై ఒక్కరు కూడా ప్రశంసించింది లేదు. అదే ర్యాంకు ఎక్కడో చివర్లో ఉంటే మాత్రం పనికట్టుకొని మరీ మీటింగ్ లు పెట్టి దీనిపై పెద్ద చర్చలు.. విమర్శలు చేసేవారు. నిజంగా ప్రజల కోసమే పాటుపడేవాళ్లు.. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసేవాళ్లయితే దీనిని రాజకీయ కోణంలో చూడకుండా ఈ విషయంలో మెచ్చుకునేవాళ్లే. నిజంగా అలాగ చేసుంటే వారికి గౌరవం దక్కేది.