బాహుబలి మరో రికార్డు
posted on Sep 16, 2015 5:11PM
.jpg)
దర్మకమౌళి రాజమౌళి జక్కన్న చెక్కిన చిత్రం బాహుబలి. ఈ సినిమా విడుదలై ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించింది. భారతీయ సినీ చరిత్రలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించబడి అనేకమంది ప్రశంసలు అందుకున్న బాహుబలి ఇప్పుడు మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ బాహుబలి చిత్రాన్ని చైనాలోని 5000 థియేటర్లలో నవంబర్‌లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకూ ఏ తెలుగు సినిమా ఇన్నీ థియేటర్లలో విడుదల కాలేదు. బాహుబలి సినిమాకే ఈ అవకాశం దక్కింది. ఈస్టార్స్ అనే సంస్థ బాహుబలి హక్కులు దక్కించుకొని ఏకంగా 5000 థియేటర్లలో రిలీజ్ చేయనుంది. ఈ రకంగా బాహుబలి మరో రికార్డు దక్కించుకుంది.
అయితే బాలీవుడ్ బ్లాక్ బాస్టర్ పీకే సినిమాను కూడా ఈ సంస్ధనే హక్కులు దక్కించుకొని చైనాలో రిలీజ్ చేసింది. ఈ సినిమా అక్కడ 150 కోట్లు సాధించింది. ఇప్పుడు బాహుబలి కూడా అదే రీతిలో భారీగా వసూళ్లు చేస్తుందనే నమ్మకం ఉందని.. బాహుబలి చైనా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని సంస్థ ప్రతినిధి ఫ్రాంకోయిస్ డిసిల్వా తెలిపారు.