జగన్ కు ఒళ్లంతా కుళ్లే.. లోకేష్
posted on Oct 16, 2015 11:19AM

తెదేపా జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిపై విమర్శల బాణాలు కురిపించారు. ఈ నెల 22వ తేదీన ఏపీ నూతన రాజధాని శంకస్థాపన కార్యక్రమం జరుగుతున్న సంగతి తెలిసింది. ఈనేపథ్యంలో జగన్ చంద్రబాబుకు బహిరంగ లేఖ కూడా రాశారు. తనను ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిలవద్దని.. పిలిచినా రానని.. ఒకవేళ పిలిచిన తరువాత రాకపోతే తనను నిందిచవద్దని అందుకే ముందే చెబుతున్నానని లేఖ రాశారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ తాము చేసే శంకుస్థాపన కార్యక్రమాన్ని ఓర్వలేకే జగన్ తాను రానని.. తనని పిలవద్దని కుంటి సాకులు చెబుతున్నారు. జగన్ కు ఒళ్లంతా కుళ్లుమోతుతనమే ఉందని అంటున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి.. ఇలా రాష్ట్ర కార్యక్రమాలను బహిష్కరించడం ఆయనకే మంచిది కాదు. ఇంత వైరం పెట్టుకున్నాక ఆయన అధికారుల్తో మాత్రం ఎలా మెదల గలుగుతున్నారు.. అని వారు అనుకుంటున్నారు. ఒక్క నారా లోకేశ్ మాత్రమే కాదు ఇతర పార్టీ నేతలు కూడా జగన్ ఓర్వలేక ఈ శంకుస్థాపన కార్యక్రమానికి రానని అంటున్నారని అనుకుంటున్నారు. మొత్తానికి ఈ హడావుడి చూసి జగన్ తాను సీఎం అయితే తన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగి ఉండేది కదా అని ఫీలవుతున్నట్టున్నారు.