ఏపీ శంకుస్థాపన 400 కోట్లు.. కాదు కాదు 10 కోట్లే అంటున్న మంత్రులు..


ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగా వైభవంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో మరోవైపు కార్యక్రమానికి అవుతున్న ఖర్చు నిమిత్తం విమర్శలు తలెత్తున్నాయి. ఒకపక్క రాష్ట్రం విడిపోయి ఆర్ధిక పరిస్థితులు అంతత మాత్రంగా ఉన్న ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అని ఇతర పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈనేపథ్యంలో ఎప్పుడు ఖర్చు గురించిన వివరాలు పట్టించుకోని సీఎం చంద్రబాబు కూడా తాను చేపట్టే కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు బడ్జెట్ గురించిన వివరాలు తెలుపుతున్నారు. అంతేకాదు మంత్రులు కూడా ఈ విమర్శలను ఖండిస్తున్నారు. ఏపీ ప్రతిపక్షనేత జగన్ శంకుస్థాపన కార్యక్రమానికి రూ 400 కోట్లు ఖర్చుచేస్తున్నట్లు చెప్పిన నేపథ్యంలో.. ఆమాటల్లో ఎంతమాత్రం నిజం లేదని.. శంకుస్థాపన కార్యక్రమానికి కేవలం రూ. 10 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నామని ఏపీ మంత్రులు తెలుపుతున్నారు.  ఇప్పటివరకూ గుంటూరు కలెక్టర్ కు రూ.7కోట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ కు రూ.2కోట్లు మాత్రమే నిధులు విడుదల చేశామని చెబుతున్నారు.

అంతేకాదు ఈ శంకుస్థాపన కార్యక్రమానికి కొంత మంది తమంతట తాముగా ఉచితంగా సర్వీసులు అందిచడానికి ముందుకు వచ్చారని.. కొంత మంది నేతలు తమ ఖర్చు తామే పెట్టుకుంటున్నారని.. అంతేకాదు ఈ కార్యక్రమానికి యాకరింగ్ గా ఒప్పుకున్న సాయికుమార్ సైతం ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ఫ్రీగా యాంకరింగ్ చేయడానికి ఒప్పుకున్నారని తెలియజేశారు. మొత్తానికి రూ.400 కోట్ల రూపాయల ఖర్చు అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేవలం రూ.10 కోట్లు మాత్రమే అని చెప్పడం దానికి సంబంధించిన వివరాలు కూడా వారు తెలియజేస్తున్నా.. కేవలం 10 కోట్ల రూపాయలకే శంకుస్థాపన కార్యక్రమం అవుతుందా అని పలువురు సందేహాలు వస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu