నేపాల్‌లో చిక్కుకున్నవారిని తీసుకొచ్చే బాధ్యత మాదే : లోకేష్

 

నేపాల్‌లో 12 ప్రాంతాల్లో  217 మంది ఏపీ పర్యాటకులు చిక్కుకున్నారని మంత్రి లోకేశ్ తెలిపారు. వీరంతా 12 ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించామని లోకేశ్ పేర్కొన్నారు. తొలి విడతలో బీహార్ బార్డర్‌కు 22 మందిని తరలించామని వెల్లడించారు. రేపు ఖాట్మండులో కర్య్ఫూ సడలించగానే 173 మందిని ప్రత్యేక విమానంలో తీసుకోస్తామని లోకేశ్ తెలిపారు.నేపాల్‌లోని తెలుగువారి పరిస్థితులపై మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు.‘

‘సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు నేపాల్‌లో ఉన్న వారిని తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అక్కడ ఉన్న రాష్ట్ర వాసులతో మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నాం. ఏపీ భవన్‌లో టోల్‌ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేసి నేపాల్‌లోని తెలుగువారిని గుర్తించామన్నారు. నేపాల్‌ అల్లర్ల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన ఏపీ వాసులను సురక్షితంగా వారి స్వస్థలాలకు తీసుకొస్తామని తెలిపారు. నేపాల్‌లో ఉన్న ప్రతి ఆంధ్రుడు ఏపీకి చేరేలా ప్రయత్నిస్తున్నాం. నేపాల్‌ నుంచి వచ్చే ప్రత్యేక విమానం విశాఖ, కడపకు చేరుకుంటుంది’’ అని మంత్రి వివరించారు.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu