నందమూరి పద్మజ కన్నుమూత
posted on Aug 19, 2025 11:37AM

తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారకరామారావు పెద్ద కోడలు నందమూరి పద్మజ కన్నుమూశారు. ఆమె వయస్సు 73ఏళ్లు. శ్వాస సంబంధిత ఇబ్బంది తలెత్తడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకువెళ్లారు.
అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి తుది శ్వాస విడిచారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి జయకృష్ణ సతీమణి నందమూరి పద్మజ. నందమూరి పద్మజ మరణంతో ఎన్టీఆర్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
ఆమె పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి విజయవాడ నుంచి హైదరాబాద్ బయలుదేరారు. అలాగే ఢిల్లీలో ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి కూడా హైదరాబాద్ కు బయలు దేరారు. మిగతా ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.