పెద్దిరెడ్డి కుటుంబం పై ఫిర్యాదు.. దర్యాప్తు

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు అరాచకాలు ఒక్కొక్కటీ బయట పడుతున్నాయి.  కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలతో ప్రజల్లో ధైర్యం కలిగింది. తమకు న్యాయం జరుగుతుందన్న భరోసాతో ముందుకు వచ్చి పెద్దిరెడ్డి, ఆయన కుటుంబీకుల అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ కోవలోనే పెద్దిరెడ్డి కుటుంబంపై పోలీసులకు తాజాగా మరో ఫిర్యాదు అందింది. 

అన్నమయ్య జిల్లా మొలకల చెరువు పోలీస్ స్టేషన్ లో పెద్దిరెడ్డి కుటుంబం పై ఓ వ్యక్తి  ఫిర్యాదు చేశారు.  2023 ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన అంకయ్య చౌదరి ఈ ఫిర్యాదు చేశారు. ఆ ఎన్నికల సమయంలో తాను పోలింగ్  బూత్ లను పరిశీలిస్తుండగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, ద్వారక నాథ రెడ్డి ప్రోత్సాహంతో తనపై దాడి చేసి తన కారు ధ్వంసం చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.   విషయాన్ని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు అప్పట్లో  జిల్లా ఎస్పికి ఫోన్  చేసిన తర్వాతనే  తనకు రక్షణ కల్పించారని అంకయ్య చౌదరి  ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దాడికి పాల్పడ్డ వారితో పాటు ప్రోత్సాహించిన పెద్దిరెడ్డికుటుంబం పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu