హైదరాబాద్‌కి జానకిరామ్ మృతదేహం

 

నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన నందమూరి జానకిరామ్ మృతదేహాన్ని హైదరాబాద్‌కి తరలించారు. ఈ ప్రమాదంలో నందమూరి జానకిరామ్‌ తలకు, వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. కుడిచేయి విరిగిపోయింది. అకస్మాత్తుగా ప్రమాదం జరగడంతో ఆయన తీవ్ర షాక్‌కి గురైనట్టుగా తెలుస్తోంది. ఆ షాక్ ఆయన ముఖంలో కనిపిస్తోంది. జానకిరామ్ కళ్ళు తెరిచే వున్నాయి. ముఖం మీద ఎలాంటి గాయాలు తగల్లేదు. జానకిరామ్‌ మృతదేహాన్ని అంబులెన్స్‌లో హైదరాబాద్‌కి తరలిస్తున్నారు. హైదరాబాద్‌లో జానకిరామ్ మృతదేహానికి పోస్టుమార్టం చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. ఇదిలా వుండగా, హరికృష్ణ నివాసానికి బంధువులు, మిత్రులు తరలి వస్తున్నారు. హరికృష్ణ ‘దేవుడు నన్ను మోసం చేశాడు’ అంటూ విలపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హరికృష్ణ ఇంటికి చేరుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu