హరికృష్ణ ఇంట్లో విషాదం..

 

నందమూరి హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్ నల్గొండ జిల్లా మునగాల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడం నందమూరి వంశానికి పెద్ద షాక్‌లా తగిలింది. నందమూరి హరికృష్ణ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అమెరికాలో స్థిరపడిన జానకిరామ్ ఇండియాకి వచ్చి ఇలా యాక్సిడెంట్‌లో మరణించడం ఈ కుటుంబానికి ఊహించని పరిణామం. యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ సమాచారాన్ని హరికృష్ణకి అందించారు. పిడుగుపాటు లాంటి ఈ వార్త విని హరికృష్ణ కుటుంబం కుప్పకూలిపోయింది. నందమూరి కుటుంబీకులందరూ జానకిరామ్ మృతదేహాన్ని ఉంచిన కోదాడ ఆస్పత్రికి వెళ్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నందమూరి కుటుంబం మొత్తం షాక్‌లో వుంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu