‘స్పెషల్ ఛబ్బీస్’ చేయడం లేదు: నాగార్జున
posted on Mar 1, 2013 1:04PM

బాలీవుడ్ లో విడుదలైన సూపర్ హిట్ అయిన అక్షయ్ కుమార్ ‘స్పెషల్ ఛబ్బీస్’ తెలుగు లో రీమేక్ చేయనున్నారు. తమిళ దర్శకుడు లింగుస్వామి ఈ సినిమా హక్కులు సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ బాషలలో ఒకేసారి తెరకెక్కించనున్నట్లు ఆయన ప్రకటించారు. స్టార్ హీరోహీరోయిన్లతో ఈ సినిమా చేయాలన్నది ఆయన ఆలోచన. తెలుగులో అక్కినేని నాగార్జున ఈ సినిమాలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తని ఆయన ఖండించారు. తాను చేస్తే బావుంటుందని అందరూ అంటున్నారు, కానీ తన వద్దకు ఆ ప్రతిపాదన రాలేదని చెప్పారు.
అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ‘స్పెషల్ చబ్బీస్’కు ‘ఎ వెడ్నస్ డే’ ఫేమ్ నీరజ్ పాండే దర్శకత్వం వహించాడు. ఎమ్.ఎమ్.కీరవాణి స్వరాలు సమకూర్చారు. 1980వ దశకంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది.