నాకు ప్రాణహాని వుంది.. చక్రి భార్య...

 

చక్రి తల్లిదండ్రులు, అక్కా చెల్లెళ్ళ నుంచి తనకు ప్రాణహాని వుందని, అందుకే తాను మానవ హక్కుల కమిషన్‌ని ఆశ్రయించాల్సి వచ్చిందని రెండు రోజుల క్రితం మరణించిన సంగీత దర్శకుడు చక్రి భార్య శ్రావణి చెప్పారు. చక్రి మరణించిన తర్వాత ఈ రెండు రోజుల్లో జరిగిన సంఘటనలు, గొడవలు తనకు ప్రాణహాని వుందన్న భయాన్ని కలిగించాయని ఆమె తెలిపారు. ఇంతకాలం తమను ఎంతమాత్రం పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు చక్రి చనిపోయిన తర్వాత తనను వేధిస్తున్నారని ఆమె అన్నారు. చక్రి తరఫు మనుషుల వల్ల తనకు భవిష్యత్తులో ప్రాణహాని ఉంటుందేమోనన్న భయంతోనే తాను హెచ్చార్సీని ఆశ్రయించానని శ్రావణి వివరించారు. నిజానికి తాను వివాదాలకు చాలా దూరంగా వుంటానని, కానీ పరిస్థితులు ఇలా మారాయని ఆమె అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu