జనసేన గూటికి ముద్రగడ పద్మనాభం కుమార్తె

ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేన గూటికి చేరారు. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమక్షంలో ఆమె జనసేన తీర్ధం పుచ్చుకున్నారు. పవన్ కల్యాణ్ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల సమయంలో తన తండ్రి ముద్రగడ పద్మనాభం పవన్ కల్యాణ్ పై విమర్శలు గుప్పిస్తూ మొత్తం కాపు జాతికి తానే ప్రతినిధిని అని చెప్పుకోవడాన్ని అప్పట్లో క్రాంతి తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. తన తండ్రి ముద్రగడ పద్మనాభం పవన్ పై చేస్తున్న విమర్శలను తాను ఖండిస్తున్నానని చెప్పి జనసేనకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.   

అప్పట్లోనే  క్రాంతి భారతి జనసేన పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. అయితే అందుకు సున్నితంగా తిరస్కరించారు. తండ్రీ కూతుళ్లను విడదీయడం తన అభిమతం కాదంటూ పవన్ కల్యాణ్ ఎన్నికల తరువాత ఆమె చేరికను ఆహ్వానని చెప్పిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే ఎన్నికలు పూర్తయ్యాయి. తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టింది. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేన గూటికి చేరారు. అన్నట్లుగానే పవన్ కల్యాణ్ ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.   

Online Jyotish
Tone Academy
KidsOne Telugu