పి.ఎం పోష‌ణ్ , నిధుల కేటాయింపుపై లోక్ సభలో కేశినేని చిన్ని ప్రశ్న

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త ఐదేళ్లుగా పి.ఎం.పోష‌ణ్ ప‌థ‌కం కింద ఎన్ని పాఠ‌శాల‌లు క‌వ‌రైయ్యాయి? ఎంత మంది పాఠ‌శాల విధ్యార్ధుల‌కి ల‌బ్ధి చేకూరింది? ఎన్ని నిధుల కేటాయింపు జ‌రిగింది.?  వాటి వినియోగం ఎలా జ‌రిగింది? ఏ ఏడాది ఎన్ని నిధులు విడుద‌ల చేశారు? ఏ ఏడాది ఎంత ఖ‌ర్చు పెట్టారు?  ముఖ్యంగా అనంత‌పురం, నంద్యాల‌, విజ‌య‌న‌గ‌రం జిల్లాల్లో పి.ఎం.పోష‌ణ్ ప‌థ‌కం ఎలా అమ‌లు జ‌రిగింది?  ఆ వివ‌రాలు తెలియ‌జేయాల‌ని సోమ‌వారం విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్, నంద్యాల ఎంపి  డాక్టర్ బైరెడ్డి శబరి, విజయనగరం ఎంపి అప్పలనాయుడు కలిశెట్టి , కర్నూలు ఎంపి బస్తిపాటి నాగరాజు, అనంతపురం ఎంపి  అంబికా జి లక్ష్మీనారాయణ తో క‌లిసి కేంద్ర పాఠశాల విద్య,  సాక్షరత శాఖ మంత్రి జయంత్ చౌదరి ను ప్ర‌శ్నించారు. 

అలాగే పి.ఎమ్ పథకాన్ని పర్యవేక్షించడానికి,  ఆర్థిక ఆడిట్ల నిర్వహణ కోసం జిల్లా స్థాయి స్క్రీనింగ్ కమిటీలను గ‌త ఐదేళ్ల‌లో రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిందా? అని ప్ర‌శ్నించ‌గా వాటికి కేంద్ర మంత్రి జయంత్ చౌదరి లిఖిత పూర్వ‌కంగా స‌మాధానం ఇవ్వ‌టం జ‌రిగింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu