ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ క్వార్టర్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్!

ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భార‌త బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టిలు అద‌ర‌గొడుతున్నారు. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి మన అమలాపురం కుర్రాడేనండోయ్! ఒలింపిక్స్ చ‌రిత్ర‌లోనే క్వార్టర్ ఫైనల్స్.కి చేరిన తొలి భార‌త బ్యాడ్మింటన్ జోడీగా చ‌రిత్ర సృష్టించారు. గ్రూప్ దశలో కూడా వీరిద్దరూ అద్భుత ప్రదర్శన చేసి టాప్‌-8లో నిలిచారు.

జ‌ర్మనీ జోడీ మార్క్-మెర్విన్‌తో జరగాల్సిన డబుల్స్ మ్యాచ్ ర‌ద్దైంది. జ‌ర్మ‌న్ ప్లేయర్ మార్క్‌కు మోకాలికి గాయం కావడంతో అతను టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్ రద్దయింది. గ్రూప్ ‘సి’లో ఆర్టియాంటో-ఆల్పియన్ (ఇండోనేషియా) చేతిలో 21-13, 13-10 తేడాతో ఫ్రెంచ్ జోడీ లాబార్-కోర్వీ ఓడిపోవడంతో సాత్విక్-చిరాగ్ జోడీ క్వార్ట‌ర్ ఫైన‌ల్‌కు అర్హత సాధించింది. ఈ జోడీ స్వర్ణాన్ని సాధించే అవకాశాలున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu