రాజాసింగ్‌ ఒక్క మిస్డ్‌కాల్‌ చాలు..పార్టీలో చేరినట్లే : అరవింద్

 

తెలంగాణ బీజేపీలో వివాదాలపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాజాభాయ్ ఎక్కడున్నా రెస్పెక్ట్ ఉంటుందని ఆయన గౌరవిస్తాము అని తెలిపారు. ఆయనను బీజేపీ బహిష్కరించలేదు. ఆయనకు ఏదో నచ్చక రాజీనామా చేశాడని అరవింద్ తెలిపారు. రేపు పార్టీ సభ్యత్వం కోసం మిస్డ్ కాల్ ఇచ్చి మెంబర్షిప్ తీసుకొచ్చు. కొన్ని విషయాల్లో మనస్తాపం చెంది రాజా భాయ్ రాజీనామా చేశారని ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియాతో చెప్పుకొచ్చారు. 

తటస్థంగా ఉండేవాళ్ళతో కమిటీ వేసి విచారిస్తే బావుండేదని ఆయన పేర్కొన్నారు. రామచందర్ రావు.. కిషన్ రెడ్డి తదితరులు తప్పుడు నివేదికలు ఇస్తున్నట్లుగా పరోక్షంగా అరవింద్ విమర్శలు చేశారు. కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి, కొండా సురేఖలు ఏం చేస్తున్నారని పార్టీ అన్నాక వివాదాలు కామన్ అని అన్నారు. బీజేపీ, పాత, కొత్త అధ్యక్షులు కలిసి ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల విషయంలో కూర్చొని మాట్లాడాలి అని సూచించారు.  తెలంగాణ బీజేపీ ఎంపీలకు ఒక్కొక్కరికి రెండు నియోజకవర్గాల బాధ్యతలు ఇవ్వాలని ఎంపీ కోరారు 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu