పెద్దిరెడ్డితో చేతులు కలిపిన ఎమ్మెల్యే కొలికపూడి
posted on Jul 23, 2025 5:11PM

వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కలవడం చర్చనీయాంశంగా మారింది. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో పెద్దిరెడ్డిని కలిసి వీరిద్దరు మంతనాలు జరిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా కొలికపూడి శాసన సభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి వివాదాలను కేంద్ర బిందువుగా మారరని దీంతో ఆయన తీరుపై తెలుగు దేశం పార్టీ గుర్రుగా ఉంది.
టీడీపీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేతను కలవడంపై సర్వత్రా చర్చ నడుస్తుంది. పోలీసులే గంజాయి అమ్మిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్‌లో కొలికపూడి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు కొట్టుకోగా.. సెటిల్‌మెంట్ కోసం పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఎమ్మెల్యే కొలికపూడి ఎంపీ వర్గపు వ్యక్తిని వదిలేసి, తన అనుచరుడిపై కేసు పెట్టారని పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో పోలీసులే ఒక బ్యాచ్‌ను పెట్టుకొని గంజాయి అమ్మిస్తున్నారంటూ పోలీస్ స్టేషన్‌లో షాకింగ్ కామెంట్స్ చేశారు.