హైదరాబాద్‌లో తల్లిపాల బ్యాంకు
posted on Jun 1, 2014 2:30PM
.jpg)
దేశంలోనే మొట్టమొదటి తల్లిపాల బ్యాంక్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. దీనిని ‘మదర్ మిల్క్ బ్యాంక్’ అని వ్యవహరిస్తారు. పుట్టుకతోనే తల్లులను కోల్పోయిన పిల్లలకు అమ్మపాలు అందించడం కోసం బాలల హక్కుల సంఘం ఈ బ్యాంకును ఏర్పాటు చేసింది. ఈ బ్యాంకులో సభ్యురాళ్ళుగా చేరే మహిళలు తల్లిలేని పిల్లలకు కొంతకాలం పాలు అందిస్తారు. తద్వారా తల్లిలేని పిల్లలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదగడానికి తమవంతు సహాయాన్ని అందిస్తారు. ఈ బ్యాంకులో సభ్యురాలుగా చేరి తల్లిలేని పిల్లలకు పాలు అందించడానికి ముందుకు వచ్చిన మొట్టమొదటి మహిళ పేరు లక్ష్మి. ఈమెలాగా ఎంతోమంది మహిళలు ముందుకు వచ్చి తల్లిలేని పిల్లలకు పాలు ఇవ్వడానికి అంగీకరిస్తే తమ శ్రమ ఫలించినట్టు భావిస్తామని మదర్ మిల్క్ బ్యాంక్ నిర్వాహకులు అంటున్నారు.