యు.పి.ఎస్.సి. అభ్యర్థులకు శుభవార్త
posted on Jun 1, 2014 2:18PM
.jpg)
సివిల్ సర్వీసెస్‌లో ప్రవేశించడానికి, ఐఎఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్‌లు అవడానికి పట్టు వదలని విక్రమార్కుల్లా ప్రయత్నించే అభ్యర్థులకు ఒక శుభవార్త. సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులకు యు.పి.ఎస్.సి. ఒక వెసులుబాటు కల్పించింది. గతంలో ఒక అభ్యర్థి నాలుగుసార్లు మాత్రమే సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే అవకాశం వుండేది. అయితే దానిని ఆరుసార్లకు పొడిగిస్తూ యు.పి.ఎస్.సి. నిర్ణయం తీసుకుంది. అలాగే 21 నుంచి 32 సంవత్సరాల మధ్య వయసు వున్న అభ్యర్థులు పరీక్షలు రాసుకోవచ్చని వయసు సడలింపును కూడా ప్రకటించింది. ఎస్.సి., ఎస్టీ అభ్యర్థులు మాత్రం గతంలో తరహాలోనే ఎన్నిసార్లయినా సివిల్స్ పరీక్షకు హాజరు కావొచ్చు. ఈసారి ఆగస్టు 24వ తేదీన సివిల్స్ పరీక్ష జరగబోతోంది. ఈ ఏడాది 1291 ఖాళీలు భర్తీ చేయనున్నారు. వీటిలో 26 స్థానాలను వికలాంగులకు కేటాయించారు.