తాగుబోతుని చితక్కొట్టింది...
posted on Mar 19, 2015 4:25PM

ఓ పక్క ఆడవాళ్ల పై అఘాయిత్యాలకి పాల్పడిన వాళ్లకి ఉరిశిక్షలు, జైలు శిక్షలు వేస్తున్నా కొంతమంది మగాళ్లు మాత్రం ఎప్పటికీ మారరు. ఓ తాగుబోతు కూడా అలాంటి నిర్వాకమే చేయబోయి యువతి చేతిలో తన్నులు తిన్నాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలో బోర్విలికి చెందిన మంధరే విలే పార్లేలోని కాలేజీలో మాస్ మీడియా థర్డ్ ఇయర్ చదువుతోంది. అయితే కాలేజీ నుండి తిరిగి వస్తూ లోకల్ ట్రైన్ కోసం చూస్తున్నఆమె మీద ఓ తాగుబోతు వచ్చి చేయివేశాడు. ఒక్కసారిగా భయపడిన మంధరే పక్కకు జరిగింది. కానీ తాగుబోతు అంతటితో ఆగక మరింత ముందుకు వచ్చాడు. దీంతో కోపం కట్టలు తెగిన మంధరే కాలేజీ బ్యాగుతో అతనిని నాలుగు ఉతుకులు ఉతికింది. దాంతో అతను ఎదురుదాడికి దిగగా మంధరే అతని జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి రైల్వై పోలీసు స్టేషన్ లో అప్పగించింది. రకరకాల ప్రశ్నలు అడిగిన తరువాత చివరికి పోలీసులు మంధరే ఫిర్యాదు స్వీకరించి అతనిపై కేసు నమోదు చేశారు.